కేటీఆర్ తో భేటీ అయ్యాడు కానీ పార్టీ మారడట

Update: 2021-06-13 05:30 GMT
తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈటల రాజీనామా నేపథ్యంలో.. గత ఎన్నికల్లో ఆయనపై పోటీ చేసిన ఓడిన కౌశిక్ టీఆర్ఎస్ లోకి జాయిన్ అవుతారన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. అయితే.. ఈ వాదనలో నిజం లేదని ఆయన తేల్చారు. తాను మంత్రి కేటీఆర్ తో భేటీ అయిన మాట వాస్తవమే అని.. కాకుండా తాను కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టటం లేదన్నారు.

త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తాను పోటీ చేస్తానని.. గెలుస్తానన్న ధీమాను వ్యక్తం చేశారు.  హుజురాబాద్ నుంచి టీఆర్ఎస్ పతనం మొదలవుతుందన్న జోస్యం చెప్పిన కౌశిక్.. మాజీ మంత్రి ఈటలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రెండు ఎకరాలున్న ఈటల ఈ రోజున తెలంగాణలో మూడు వేల ఎకరాల భూములు.. హైదరాబాద్ లో కోట్లు విలువ చేసే ఆస్తులు ఎక్కడ నుంచి వచ్చాయని ప్రశ్నించారు.

తాను చేసిన ఆరోపణల్లో అబద్ధాలు ఉంటే.. తనను హుజూరాబాద్ లోని అంబేడ్కర్ చౌరస్తాలో తననుఉరి తీయాలని సవాల్ విసిరారు. మరి.. ఈటల ఇందుకు సిద్ధమా?. అని ప్రశ్నించారు. వేల కోట్ల ఆస్తుల్ని కాపాడుకునేందుకే బీజేపీలోకి వెళుతున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ఈటలకు ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. మంత్రి కేటీఆర్ తో భేటీ నేపథ్యంలో కౌశిక్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మరి.. ఆయన మాటలకు ఈటల ఏ రీతిలో బదులిస్తారో చూడాలి.
Tags:    

Similar News