హైదరాబాద్ లో త్వరలో మెట్రోల్ రైల్ తరహాలోనే మెట్రో బస్సులు సాకారం కానున్నాయి. ఈ మేరకు ఎలివేటెడ్ బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (ఈబీఆర్.టీఎస్) ఏర్పాటు చేస్తామని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రూ.2500 కోట్లతో కేపీహెచ్.బీ నుంచి కోకాపేట వరకూ 22 కి.మీ మేర ఈ ప్రాజెక్టు నిర్మిస్తామన్నారు. పీపీపీ పద్ధతిన దీనిని చేపడుతామని.. మెట్రో రైల్ సహకారంతో హెచ్ఎండీఏ అమలు చేస్తోందని తెలిపారు.
టీఎస్ఐఐసీ భాగస్వామ్యంతో నడిచే ఈ మెట్రో బస్సు సర్వీసులపై శనివారం అసెంబ్లీలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. రానున్న ఏడేళ్లలో నగరాల్లో జనాభా భారీగా పెరుగుతుందని.. అందుకే మున్సిపాలిటీల సంఖ్యను ప్రభుత్వం పెంచిందని తెలిపారు. పట్టణాల్లో తాము తీసుకొచ్చిన టీడీఆర్ విధానాన్ని నీతి అయోగ్ కూడా ప్రశంసించిందన్నారు. ఈ విధానంతో జీహెచ్ఎంసీకి సుమారు రూ.3వేల కోట్లు మిగిలాయని తెలిపారు.
ఇక పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా 142 మున్సిపాలిటీలకు రూ.3206 కోట్లు, జీహెచ్ఎంసీకి రూ.1000 కోట్లు తెలంగాణ సర్కార్ కేటాయించింది. పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులకు 3809 కోట్లు ఇచ్చారు. ఇక పట్టణ మున్సిపాలిటీల్లో 1600 నర్సరీలు పెట్టామన్నారు. 10శాతం నిధులను గ్రీన్ బడ్జెట్ కోసం ఖర్చు చేస్తున్నారు. హైదరాబాద్ లోని పచ్చదనాన్ని చూసి ఐక్యరాజ్యసమితి కూడా గ్రీన్ సిటీగా అభివర్ణించింది.
కేంద్ర అటవీశాఖ సైతం రాష్ట్రంలో పచ్చదనం గతం కంటే 147 శాతం పెరిగిందని చెప్పినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రగతికి కేంద్ర ప్రభుత్వం తమకు సహకరించదని.. కానీ తమ పనిని మాత్రం గుర్తించక కేంద్రానికి తప్పడం లేదని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వంలో 4882 చెత్త సేకరణ వాహనాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రతిరోజూ 6వేల మెట్రిక్ టన్నుల చెత్తను ఇవి సేకరిస్తున్నాయని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో డొక్కు వాహనాలు ఉండేవని.. తాము చెత్త సేకరణకు బెంజ్ వాహనాలను పెట్టామని తెలిపారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని.. వాటిపై తాము అధిక నిధులు ఖర్చు చేస్తామని అన్నారు.
హైదరాబాద్ మహానగరం రాష్ట్రానికి ఎకనామిక్ ఇంజిన్ అని కేటీఆర్ అన్నారు. నగరంలో లింకు రోడ్లను కూడా పూర్తి చేశామని.. రెండు దశల్లో వందకు పైగా రోడ్లను రూ.2వేల కోట్లతో నిర్మించ తలపెట్టామని తెలిపారు. రోడ్లు సరిగా వేసేందుకు.. దానిని మెయింటెయిన్ చేసేందుకు సీఆర్ఎంపీ విధానం తీసుకువచ్చామన్నారు. రూ.22వేల కోట్లతో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మించామని కేటీఆర్ గుర్తు చేశారు. మెట్రోను కోవిడ్ దెబ్బ కొట్టినందున దానిని ఆదుకునేందుకు రూ.1500 కోట్లు కేటాయించామని కేటీఆర్ తెలిపారు.