గ్రీన్ టీ గురించి ప్రపంచానికి తెలిపిందెవరంటే?

Update: 2021-09-18 00:30 GMT
కొవిడ్ తర్వాత జనాల్లో హెల్త్ కాన్షియస్‌నెస్ బాగానే పెరిగిందని పలు అధ్యయనాలు పేర్కొన్న సంగతి అందరికీ విదితమే. హెల్దీ ప్లస్ న్యూట్రిషియస్ ఫుడ్‌ను ప్రజలు తమ జీవనంలో భాగం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గ్రీన్ టీ కూడా సేవిస్తున్నారు. నార్మల్ టీ కంటే కూడా గ్రీన్ టీ వల్ల పలు ప్రయోజనాలున్నాయన్న ప్రచారం బాగా జరగగా, దీనిని తాగుతున్నారు. గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి మంచి జరగడంతో పాటు వెయిట్ లాస్ అవుతారన్న ప్రచారం జనంలో ఉంది. ఇకపోతే గ్రీన్ టీని ప్రపంచానికి తెలిపేందెవరో మీకు తెలుసా.. మిచియో సుజిమురా అనే ఆవిడ గ్రీన్ టీ ని ప్రపంచానికి పరిచయం చేసింది.

మిచియో సుజిమురా.. జపనీస్‌ ఎడ్యుకేషననిస్ట్‌, బయోకెమిస్ట్‌ కాగా  గ్రీన్‌ టీలోని మూలకాల్ని ప్రపంచానికి తన పరిశోధనల ద్వారా తెలిపింది. సదరు పరిశోధనలకుగాను మిచియోకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇవాళ మిచియో సుజిమురా 133వ జయంతి. ఈ సందర్భంగా గూగుల్‌ సెర్చ్ ఇంజిన్ ఆమెను గుర్తు చేస్తూ డూడుల్‌ను విడుదల చేసింది. మిచియో సుజిమురా జపాన్‌లో వ్యవసాయంలో డిగ్రీ పట్టా పుచ్చుకున్న మొదటి మహిళగా రికార్డుకెక్కింది. ఈమె పరిశోధనలను రీసెర్చ్ స్కాలర్స్, ఔత్సాహిక పరిశోధకులు ఇప్పటికీ పరిశీలిస్తూనే ఉంటారు. గ్రీన్ టీ లో ఉండే పోషక విలువలను తెలిపిన సుజిమురా 1888 సెప్టెంబర్‌ 17న సైతామా రీజియన్‌లోని ఓకేగావాలో పుట్టారు. స్కూలింగ్ పూర్తయ్యాక టోక్యో ఇంపీరియల్‌ యూనివర్సిటీలో మిచియో బయోకెమిస్ట్రీలో రీసెర్చ్‌ చేశారు.

ఈ క్రమంలోనే గ్రీన్‌ టీపై పరిశోధనల్లో డాక్టర్‌ ఉమెటారో సుజుకీ ఆమెకు సహకరించారు. గ్రీన్‌ టీలో విటమిన్‌ బి-1 ఉంటుందని, వారానికి మూడు సార్లు గ్రీన్‌ టీ తాగితే మనిషి జీవితకాలం పెరగడంతో పాటు గుండెపోటు ముప్పును నివారించచొచ్చని ఆమె పరిశోధన ద్వారా స్పష్టం చేసింది. సుజుకీ-సుజిమురా పరిశోధనల్లో మైక్రోస్కోప్‌ పరిశోధనల్లో విటమిన్‌ సీని కూడా గ్రీన్‌ టీలో గుర్తించారు. సుజుకీ-సుజిమురా పరిశోధనలన్నిటినీ కలిపి ‘ఆన్‌ ది కెమికల్‌ కాంపోనెన్‌ట్స్‌ ఆఫ్‌ గ్రీన్‌ టీ’ పేరుతో థీసిస్‌ రూపొందించి విడుదల చేసింది సుజిమురా.

1932లో వ్యవసాయంలో డాక్టరేట్‌ గౌరవపట్టా పొందిన తొలి జపాన్‌ మహిళగా మిచియో సుజిమురా ఘనత సాధించారు. విద్యావేత్తగాను పేరు సంపాదించిన సుజిమురా టోక్యో హోం ఎకానమిక్స్‌ యూనివర్సిటీకి మొట్టమొదటి డీన్‌‌గా పని చేశారు. గ్రీన్ టీ లోని ఎపిగాలోకేటెచిన్-3 గ్యాలేట్ అనే పోషకం మొటిమల పెరుగుదలకు దోహదం చేసే ప్రాంతంలోనూ బ్యాక్టీరియా పెరగకుండా చేస్తుందట. దీని ద్వారా హెల్త్‌కు మేలు జరుగుతుందట. గ్రీన్ టీలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీస్ మొటిమలు రాకుండా చేస్తాయి.

ప్రొఫెసర్‌గా పని చేసిన మిచియో సుజిమురా.. 1955లో రిటైర్‌ అయ్యారు. అయితే, ఆ తర్వాత కూడా ఆమె పార్ట్‌ టైం వృత్తిలో చాలా కాలం కొనసాగారు. 1969, జూన్‌ 1న 81ఏళ్ల వయసులో వృద్ధాప్యంలో పలు అనారోగ్య సమస్యలతో మిచియో కన్నుమూశారు.   అయితే, పరగడుపున, ఖాళీ కడుపుతో గ్రీన్ టీ ఎక్కువ తాగితే గ్యాస్ట్రిక్, లివర్‌కి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. గర్భవతులు రెండు కప్పుల కంటే ఎక్కువ గ్రీన్ టీ తాగితే... గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉందని జపాన్‌ రీసెర్చర్స్ పేర్కొన్నారు.

రాత్రి పడుకునే ముందర, మందులు వేసుకునేప్పుడు గ్రీన్ టీ తాగొద్దని నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత గ్రీన్‌టీ తాగితే భోజనం నుంచి లభించే పోషక వలువలు తగ్గిపోతాయని అంటున్నారు. హ్యూమన్ బాడీలోని కొలెస్ట్రాల్ కరిగించడానికి, వెయిట్ లాస్ అయ్యేందుకుగాను గ్రీన్ టీ చాలా ఉపయోగపడుతుందని చెప్తున్నారు.
Tags:    

Similar News