దేనికైనా ఒక హద్దు ఉంటుంది. దాన్ని దాటితే ఇబ్బందే. అలాంటి పనే ఒకటి చేసిన ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సారీ చెప్పాల్సి వచ్చింది. వెనుకా ముందు చూసుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైనానికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. మంచి కంపెనీగా పేరున్న ఇలాంటి కంపెనీ ఈ పని చేయటమా అని పలువురు విమర్శలు చేయటం.. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావటంతో.. ఈ ప్రచారం కంపెనీ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తుందన్న ఉద్దేశంతో కంపెనీకి చెందిన కీలక అధికారి ఒకరు రంగంలోకి దిగాల్సి వచ్చింది.
ఈమధ్యన మైక్రోసాఫ్ట్ కంపెనీకి చెందిన అత్యున్నత స్థాయి సిబ్బంది ఒక పార్టీ చేసుకున్నారు. ఎక్స్ బాక్స్ గేమ్స్ డెవలపర్ కాన్ఫరెన్స్ సందర్భంగా శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక పార్టీ ఇచ్చారు. ఈ పరాటీలో పొట్టి పొట్టి దుస్తులున్న అమ్మాయిలు డ్యాన్సులు వేయటం.. వాటిని ఎంజాయ్ చేస్తూ మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.
ఈ ఫోటోల్ని చూసిన పలువురు దుమ్మెత్తి పోయటమే కాదు.. విలువలున్న కంపెనీలు ఇలాంటి పని చేయటం ఏమిటంటూ తిట్ల దండకం అందుకున్నారు. దీంతో.. కంగుతిన్న మైక్రోసాఫ్ట్ అత్యున్నత అధికారుల్లో ఒకరైన ఎక్స్ బాక్స్ హెడ్ ఫిల్ స్పెన్సర్ సారీ చెబుతూ ఒక ప్రకటన జారీ చేశారు. పార్టీ జరిగిన తీరు సరికాదని.. దీన్ని సహించలేమని.. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇచ్చారు. సరదాగా సాగాల్సిన పార్టీ యవ్వారం ఇంత సీరియస్ కావటం మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు చేదుగురుతుగా మారుతుందనటంలో సందేహం లేదు.