ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఒక కొత్త బిజినెస్ లోకి ఎంటరైంది. గంజాయి వ్యాపారంలోకి అడుగు పెట్టింది. వినోదం.. వైద్యానికి సంబంధించిన అవసరాల వినియోగం కోసం చేపట్టే చట్టబద్ధమైన వ్యాపారంలోని మార్కెటింగ్ అంశాల్లో సాఫ్ట్ వేర్ ను సిద్ధం చేసేందుకు నడుం బిగించింది. అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో గంజాయి సాగుకు చట్టబద్ధత ఉంది. ఇలా అధికారికంగా ఈ వ్యాపారాన్ని చేసే వారికి అవసరమైన మార్కెటింగ్ సాఫ్ట్ వేర్ ను రూపొందించేందుకు తాము పని మొదలు పెట్టినట్లుగా ఈ వ్యాపార దిగ్గజం పేర్కొంది.
మైక్రోసాఫ్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ బిజినెస్ అనే సాఫ్ట్ వేర్ ద్వారా గంజాయి సాగు.. అమ్మకాలను చట్టబద్ధం చేసిన అమెరికాలోని రాష్ట్రాల్లో మైక్రోసాఫ్ట్ తన సాఫ్ట్ వేర్ సేవల్ని అందించనున్నది. ఇప్పటివరకూ ఈ తరహా బిజినెస్ లో అడుగు పెట్టేందుకు దిగ్గజ కంపెనీలు ఆసక్తి ప్రదర్శించలేదు. అందుకు భిన్నంగా మైక్రోసాఫ్ట్ మాత్రం ముందుకు రావటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.