ప్రపంచవ్యాప్తంగా డెస్కు టాప్ లు వాడే వారికి విండోస్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆపిల్ వారి మాక్ లను వినియోగించే వారు మినహా.. మైక్రోసాఫ్ట్ వారి విండోస్ బాగానే తెలుస్తుంది. ఆరేళ్ల క్రితం విండోస్ 2015 వెర్షన్ వచ్చింది. అప్పటివరకు అందుబాటులో ఉన్న వెర్షన్ తో పోలిస్తే విండోస్ 10 వినూత్నంగా ఉందన్న ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా విండోస్ 11 అందుబాటులోకి వచ్చింది.
తాజాగా ఈ వెర్షన్ ను మైక్రోసాఫ్ట్ సంస్థ అధికారికంగా విడుదల చేసింది. విండోస్ 10తో పోలిస్తే.. విండోస్ 11 లుక్ డిఫరెంట్ గా ఉండటమే కాదు.. దాన్ని వినియోగించే వారి ఫీల్ సరికొత్తగా ఉందని చెప్పక తప్పదు. విండోస్ 10 మాదిరి కొత్త వెర్షన్ లో లైవ్ టైల్స్ లేవు. లైవ్ టైల్స్ లేకుండా విండోస్ 11 వెర్షన్ లో స్టార్ట్ మెనూ ఉంది.
అంతేకాదు.. విండోస్ లో టాస్క్ బార్ ఎడమ వైపు చివర్లో ఉంటుంది. దాన్ని తాజా వెర్షన్ లో పూర్తిగా మార్చేశారు. దాన్ని మధ్యలోకి తీసుకొచ్చేశారు. మొత్తానికి విండోస్ 10తో పోలిస్తే.. 11 పూర్తి భిన్నంగా ఉందని చెప్పక తప్పదు. ఆరేళ్ల తర్వాత తీసుకొచ్చిన కొత్త వెర్షన్.. విండోస్ వినియోగదారుడికి కొత్త ఫీల్ ఇవ్వటంలో సక్సెస్ అయినట్లు చెప్పక తప్పదు.