ఇటీవల దుర్వార్తలను కాస్త తక్కువగా వింటున్న టెక్ ఉద్యోగులకు మరో భారీ షాక్ వంటి వార్త తెరమీదకు వచ్చింది. టెక్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. తన సంస్థలోని వేలాది సంఖ్యలో ఉద్యోగులను మైక్రోసాఫ్ట్ తొలిగించనుందట. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్దమైనట్లు అమెరికాలోని మీడియా సంస్థ వెల్లడించింది. కంపెనీ సేల్స్ డిపార్ట్ మెంట్ ను పునర్ వ్యవస్థీకరించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కంపెనీకి చెందిన కస్టమర్ యూనిట్ తో పాటు ఎస్ ఎంఈ డివిజన్లు విలీనం కానున్నాయి. ఈ నేపథ్యంలో క్లౌడ్ సర్వీస్ పై దృష్టిపెట్టిన మైక్రోసాఫ్ట్ భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలిగింపుకు నిర్ణయం తీసుకున్నట్లు బ్లూమ్ బర్గ్ పత్రిక తన కథనంలో పేర్కొంది. కేవలం సేల్స్ డిపార్ట్ మెంట్ లోనే భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలిగింపు ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోందని ఆ కథనం వెల్లడించింది. ఉద్యోగుల తొలిగింపు ఈ వారంలో మొదలయ్యే అవకాశాలున్నాయి. గత ఏడాది మైక్రోసాఫ్ట్ సుమారు మూడు వేల మందిని తొలిగించింది. అయితే ఈ ఏడాది చివరలోగా మరోసారి భారీ కుదింపు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామం టెకీలకు షాక్ వంటిదని పలువురు వాపోతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/