భారత్ లో లక్షల సంఖ్యలో యూట్యూబ్ వీడియోలను ఆ సంస్థ తొలగించడం కలకలం రేపుతోంది. సరైన మార్గదర్శకాలు, యూట్యూబ్ ప్రైవసీ నిబంధనలు పాటించకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇలా యూట్యూబ్ తొలగించిన వీడియోలు అమెరికాలో కంటే ఇండియాలోనే ఎక్కువ ఉన్నాయని చెబుతున్నారు. నిబంధనలు పాటించకపోవడంతో మన దేశంలో ఈ ఏడాది తొలి మూడు నెలల్లో (జనవరి నుంచి మార్చి వరకు) 11,75,859 వీడియోలను బ్లాక్ చేసినట్లు యూట్యూబ్ తెలిపింది. వీటిల్లో ఎక్కువగా అశ్లీల వీడియోలు, హింసను ప్రేరేపించేవి, చిన్నారుల భద్రతను సవాల్ చేసేవి ఉన్నాయని యూట్యూబ్ వెల్లడించింది, ఈ మేరకు ఇటీవల యూట్యూబ్ ఒక నివేదికను విడుదల చేసింది.
ఈ నివేదిక ప్రకారం ఇందులో ఈ ఏడాది తొలి మూడు నెలలు (జనవరి-మార్చి)లో ప్రపంచ వ్యాప్తంగా 38.82 లక్షల వీడియోలను తొలగిస్తే అందులో అమెరికా కంటే అధికంగా భారత్‌లోనే అధిక వీడియోలు ఉండటం గమనార్హం.
నిజానికి యూట్యూబ్ నివేదిక పేర్కొన్నదాని కంటే మన దేశంలో తొలగించిన వీడియోల సంఖ్య ఎక్కువగానే ఉందని అంటున్నారు. కారణం యూట్యూబ్ తొలగించిన వీడియోలతోపాటు కొన్ని అభ్యంతరకర వీడియోలపై కేంద్ర ప్రభుత్వం కూడా యూట్యూబ్ కు ఫిర్యాదులు పంపింది.
ఇలా ప్రభుత్వ విభాగాలు, ప్రజలు, వివిధ స్వచ్చంద సంస్థల ద్వారా 95 వేల ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల ఆధారంగా మరో 2,58,088 వీడియోలను అదనంగా తీసేశారు. దీంతో దేశంలో మొత్తం 14,33,947 యూట్యూబ్ వీడియోలను తీసివేసినట్టయింది. ఇందులో అధికంగా చిన్నారుల భద్రతను సవాల్ చేసేవి 24.9 శాతం, హింసాత్మక వీడియోలు 21.2 శాతం, అశ్లీల వీడియోలు 16.9 శాతం ఉన్నాయి.
ఇక యూట్యూబ్‌లో ఎక్కువగా వీడియోలను తొలగిస్తున్న దేశాల జాబితాలో భారత్ గత రెండేళ్లుగా అగ్రస్థానంలో ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. 2019 మూడో త్రైమాసికంలో 5వ స్థానంలో ఉండగా 2020 తొలి త్రైమాసికానికి వచ్చేసరికి రెండో స్థానంలోనూ, అదే ఏడాది మూడో త్రైమాసికం నుంచి ఇప్పటివరకు మొదటి స్థానంలో కొనసాగుతోందని పేర్కొంటున్నారు. అలాగే ఈ ఏడాది తొలి మూడునెలల్లో ప్రపంచ వ్యాప్తంగా 44 లక్షల చానెళ్లను నిలిపివేసినట్లు యూట్యూబ్ ప్రకటించింది.