మరో బీజేపీ రాష్ట్రంలో ఎంఐఎం పాగా..

Update: 2022-11-01 04:39 GMT
ఒకప్పుడు హైదరాబాద్ పాతబస్తీకే పరిమితమైన ఎంఐఎం ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరిస్తూ సత్తా చాటుతోంది. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, బీహార్, యూపీ, బెంగాల్ ఇలా ముస్లిం ప్రాబల్యమున్న  ప్రాంతాలు, నియోజకవర్గాలకు విస్తరిస్తూ సత్తా చాటుతోంది. తాజాగా మన పొరుగున ఉన్న కర్ణాటకలోనూ పాగా వేసింది.

కర్ణాటకలోని విజయపుర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎం పోటీచేసిన నాలుగు వార్డులలో రెండింటిని కైవసం చేసుకుంది. 25వ వార్డు నుంచి సూఫియా అబ్దుల్ రెహ్మాన్, 28వ వార్డు నుంచి రిజ్వానా కైసర్ హుస్సేన్ విజయం సాధించారు. విజేతలను ఈ సందర్భంగా పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అభినందించారు.

కర్ణాటక రాజకీయాల్లో తమ ఎంట్రీ ఈ చిరస్మరణీయమైన విజయంతో ప్రారంభమైందని ఆయన ట్వీట్ చేశారు. సోమవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. మొత్తం 35 స్థానాలలో బీజేపీ 17 వార్డులను గెలుపొందగా.. కాంగ్రెస్ 10 చోట్ల విజయం సాధించింది.

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బలంగా ఉన్న ముస్లిం సామాజికవర్గాన్ని ఏకం చేసి సీట్లను కొల్లగొట్టేందుకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ విస్తృతంగా ఆ రాష్ట్రంలో పర్యటించారు. ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు.  ఈ క్రమంలోనే ఈ హైదరాబాద్ ఎంపీపై కాల్పులు కలకలం రేపాయి.  ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కాల్పుల్లో అసదుద్దీన్ ఓవైసీ ప్రాణాలతో బయటపడ్డాడు. ఓవైసీ ప్రయాణిస్తున్న కాన్వాయ్ లోని ఓ కారు పంక్చరైంది.మీరట్ లో ప్రచారం అనంతరం ఢిల్లీకి తిరిగి వస్తుండగా చాజర్సీ టోల్ గేట్ వద్ద నిందితులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలోనే మాజీ మేయర్ హుస్సేన్ నిందితుడిపై కారు ఎక్కించారు.  మొత్తం నాలుగు రౌండ్లు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో అసద్ తప్పించుకున్నారు.

ఇటీవల జరిగిన యూపీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీచేసింది. బీజేపీని ఓడిస్తామంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ విస్తృత ప్రచారం చేశారు యూపీ ఎన్నికల్లో ఆల్ ఇండియా మజ్లిస్ పార్టీ(ఎంఐఎం)కి పోలైన ఓట్లలో 0.47 శాతం ఓట్లు వచ్చాయి.  ఇక్కడ ప్రభావం చూపకున్నా తమ వర్గం వారి ఓట్లు సంపాదించడంతో ఎంఐఎం సఫలీకృతమైంది.  ఇప్పుడు కర్ణాటకలోనూ దాని ప్రభావం చూపడం విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News