బీజేపీ ఇలాఖాలో ఎంఐఎం దూకుడు

Update: 2019-10-24 05:24 GMT
హిందుత్వ బీజేపీ ఇలాఖాలో ముస్లింల పార్టీ ఎంఐఎం దూకుడు ప్రదర్శిస్తోంది. కాంగ్రెస్, ఎన్సీపీ లాంటి పార్టీలు కూడా బలమైన పోటీ ఇవ్వలేకపోతున్న నేపథ్యంలో బీజేపీ పెద్దాయన మోడీకి షాకిచ్చేలా అనూహ్యంగా సత్తా చాటుతోంది..

హైదరాబాద్ పాతబస్తీలో పుట్టిన ఎంఐఎం పార్టీని ఎంపీ అసదుద్దీన్ దేశవ్యాప్తంగా విస్తరించాడు. ముస్లింల ఓట్లు దక్కించుకునేందుకు ఎక్కడైతే ముస్లింలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ఎంఐఎంను  పోటీకి దించారు. మహారాష్ట్రలోనూ ఎంఐఎం ఏకంగా 24 ముస్లిం ప్రాబల్య అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసింది.

తాజాగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఔరంగాబాద్ పరిధిలోని మూడు అసెంబ్లీ సీట్లలో ఎంఐఎం ముందంజలో నిలిచింది. ఔరంగాబాద్,  బీర్ , కొల్హాపూర్ లలో బీజేపీకి చెక్ పడుతూ ముందంజలో ఉంది. ఇక ఎంఐఎం ఆధిక్యంతో అక్కడ ప్రతిపక్ష కాంగ్రెస్-ఎన్సీపీ అవాక్కైంది.

ఎంఐఎం పోటీకి దిగకపోతే ఈ ఓట్లన్నీ కాంగ్రెస్-ఎన్సీపీకి పడేది. ఇప్పుడు కాంగ్రెస్ ఓట్లను చీలుస్తూ బీజేపీకి  ఎంఐఎం పరోక్ష లాభం కలిగిస్తోంది.

మొత్తం 24 సీట్లలో ఎంఐఎం మహారాష్ట్రలో మూడు దక్కించుకునేలా కనిపిస్తోంది. మహారాష్ట్రలో పోటీతో ముస్లిం ఓట్లను కాంగ్రెస్ కు దక్కకుండా ఎంఐఎం కుట్ర చేస్తోందన్న అక్కసు కాంగ్రెస్ లో కనిపిస్తోంది.
Tags:    

Similar News