`పాతబస్తీకే పరిమితం`అనే పేరు పొందిన మజ్లిస్ పార్టీ రాష్ట్రమంతా విస్తరిస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దేశంలోని పలు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం పార్టీ తాజాగా తెలంగాణలోని మున్సిపల్ ఎన్నికల్లో మరో ప్రత్యేకతను సంతరించుకుంది. 286 స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థులను బరిలోకి దింపింది. సహజంగానే ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆ పార్టీ పోటీచేస్తోంది. అయితే, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలైన సీపీఐ - సీపీఎం కంటే అధికంగా.. ఓవైసీల పార్టీ అభ్యర్థులు బరిలో దిగడం ప్రత్యేకతను సంతరించుకోవడం గమనార్హం.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 44 మున్సిపాలిటీ లు - నాలుగు కార్పొరేషన్ల నుంచి పురపోరులోకి దూకింది. భైంసా - నిర్మల్ - కరీంనగర్ - ఆదిలాబాద్ - జల్ పల్లి - తాండూరు - నిజామాబాద్ - కామారెడ్డి - సంగారెడ్డి - మహబూబ్ నగర్ - జనగామ - జగిత్యాల - మెట్ పల్లి - రామగుండం - నల్లగొండ మున్సిపాలిటీల్లో ఎక్కువ స్థానాల్లో పోటీచేస్తున్నది. భైంసాలో తిరిగి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఏకంగా ఇప్పటికే భైంసాలో ఇప్పటికే మూడువార్డుల్లో ఎంఐఎం అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుపొందడం గమనార్హం.
మరోవైపు జాతీయ పార్టీలైన సీపీఐ - సీపీఎం కంటే ఎక్కువ స్థానాల్లో మజ్లిస్ బరిలో నిలిచింది. మజ్లిస్ 286 మందిని పురపోరులో నిలుపగా... సీపీఐ 177 స్థానాల్లో - సీపీఎం 166 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. ఎంఐఎం అధినేత ఒవైసీ ముస్లిం జనాభా ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో అభ్యర్థులను పోటీలో పెట్టారు. కొన్ని చోట్ల టీఆర్ ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు.