రెండు రాష్ట్రాలు - 17 రాష్ట్రాల ఉప ఎన్నికల్లో నిన్న వెల్లడైన ఫలితాలో హైదరాబాద్ కు చెందిన ఎంఐఎం పార్టీ దేశం దృష్టిని ఆకర్షించింది. మహారాష్ట్రలోని రెండు సీట్లను గెలుచుకోవడంతో పాటు తొలిసారి బీహార్ లోని కిషన్ గంజ్ సీటు గెలుచుకోవడంతో అందరి దృష్టీ ఆ పార్టీపై పడింది. అంతేకాదు.. ఎంఐఎం దేశవ్యాప్తంగా విస్తరిస్తోందన్న విశ్లేషణలూ మొదలయ్యాయి. నిజానికి నిన్నటి ఎన్నికల ఫలితాలలో ఎంఐఎం సాధించింది పెద్దగా ఏమీ లేదు. మహారాష్ట్రలో రెండు సీట్లు గెలవడం వారికి కొత్తేమీ కాదు 2014లోనూ గెలిచారు. బిహార్ ఉప ఎన్నికల్లో గెలవడం ఒకటి వారు కొత్తగా సాధించిన విషయం.
మహారాష్ట్రలో ఎంఐఎం రెండు సీట్లు సాధించడం నిజమే అయినప్పటికీ వారు గత ఎన్నికల్లో గెలిచిన సీట్లలో ఇప్పుడు ఓటమి పాలవడం ఇక్కడ గుర్తించాలి. అలాగే బిహార్లో గెలిచిన సీటు పూర్తిగా ముస్లిం సీటు. అక్కడ 1952 - 1964లో తప్ప ఒక్కసారి కూడా ముస్లిమేతరులు గెలవలేదు. అది కాంగ్రెస్ కంచుకోట.. అక్కడ ఎంఐఎం గెలవడం కాంగ్రెస్ పార్టీకే నష్టం కలిగించింది.
ఇక మహారాష్ట్రలోనూ నాలుగైదు స్థానాల్లో ఎంఐఎం రెండో స్థానంలో నిలిచింది. ఎంఐఎం కారణంగా ఆయా స్థానాల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. షోలాపూర్ సిటీ సెంట్రల్ - బైకుల్లా - ఔరంగాబాద్ సెంట్రల్ - ఔరంగాబాద్ ఈస్ట్ నియోజకవర్గాల్లో ఎంఐఎం పార్టీ రెండో స్థానంలో నిలిచింది. ఔరంగాబాద్ వెస్ట్ - బాలాపూర్ నియోజకవర్గాల్లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లను సంపాదించింది. ఈ నియోజకవర్గాల్లో ఒక్కో చోట సుమారు 40 వేల చొప్పున ఓట్లను సాధించింది. ఈ స్థానాలు కొన్నింట కాంగ్రెస్ నష్టపోయింది.