ఫార్నర్స్, సాఫ్ట్ వేర్ వాళ్లకు భయపడుతున్న జనాలు

Update: 2020-03-05 19:30 GMT
అక్కడెక్కడో చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ నుంచి ఇన్నాళ్లు దేశానికి వచ్చిన ముప్పేమీ లేదని తెగ సంబరపడిపోయాం. మన దాకా వస్తుందా అని చంకలు గుద్దుకున్నాం. భారత దేశంలో చైనావాళ్లలాగా ఏదీ పడితే దాన్ని సజీవంగా తినే సంస్కృతి లేకపోవడంతో మనం సేఫ్ అనుకున్నాం.. కానీ ఈ మాయదారి రోగాన్ని పట్టుకొని వచ్చారు విదేశీయులు, సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు.. ఇప్పుడు మన ప్రాణానికి చుడుతున్నారు.

విదేశాల్లో విస్తరిస్తున్న కరోనా వైరస్ ను అక్కడికి వెళ్లి మరీ అక్కడి కరోనా రోగులతో రాసుకుపూసుకు తిరిగి ఇక్కడికి తీసుకొస్తున్నారు మన సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు. తాజాగా దుబాయ్ లో ఆఫీసు పని మీద వెళ్లి హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అక్కడ చైనా వారితో కలిసి కరోనా వైరస్ ను అంటించుకొని వచ్చి తెలంగాణకు తీసుకొచ్చాడు.

ఇక ఇటలీ దేశ పర్యాటకులు 16మంది టూరిస్టులుగా వచ్చి మన దేశంలోని వారికి కరోనా అంటించారు.

ఇలా ఎక్కడి నుంచే వైరస్ తీసుకొని వచ్చారో తెలియడం లేదు కానీ మన దేశానికి తీసుకొచ్చి అంటిస్తున్నారు. దీంతో ఇప్పుడు హైదరాబాద్ జనాలే ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. పాపం ఎవరో కొంత మంది వాళ్ల అందరినీ చూసి బయపడుతున్నారు దూరంగా ఉంటున్నారు.
Tags:    

Similar News