కేంద్రం లాక్ డౌన్ ఐదోదశలో ఇచ్చిన సడలింపులు నేపథ్యంలో కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 8వ తేదీ నుంచి హోటళ్లు.. రెస్టారెంట్లు ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు మంత్రులు అవంతి శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాస్ హోటళ్ల యాజమాన్యాలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈ వైరస్ నివారణ చర్యలు పాటిస్తూ హోటళ్ల నిర్వహణ అంశాలపై యాజమాన్యాలతో చర్చలు జరిపారు.
సోమవారం నుంచి హోటల్ రూమ్స్ ఆన్ లైన్ బుకింగ్స్ కూడా ప్రారంభం కానున్నాయి. అలాగే వరుస ప్రమాదాలతో నిలిచిపోయిన బోటింగ్ ను కూడా తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఏపీలో అతిపెద్ద కోస్తా తీరం.. సుందర నదులు.. టూరిస్ట్ స్పాట్లు చాలా ఉన్నాయి. అన్ని చోట్లా హోటళ్లు ఓపెన్ చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నాం అని తెలిపారు. మార్చి నెలలో మూతపడిన హోటల్స్ , రెస్టారెంట్లు తిరిగి ఈ నెల 8న ప్రారంభం కానున్నాయి.
రెండున్నర నెలలుగా వ్యాపారం లేక ఉసూరుమంటున్న పర్యాటక, ఆతిధ్య రంగాన్ని గాడిన పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ముందుగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కాకినాడ పట్టణాల్లో హోటల్స్, రెస్టారెంట్లు ప్రారంభిస్తారు. ఆ తర్వాత అన్ని ప్రైవేటు హోటల్స్, రెస్టారెంట్లతో పాటు ప్రభుత్వ టూరిజం విభాగం ఆధ్వర్యంలో నడిచే హరిత హోటళ్లు కూడా ప్రారంభం అవుతాయి అని మంత్రి గారు తెలిపారు. అరకు, గండికోట, హర్సలీహిల్స్ వంటి ప్రాంతాల్లో ఫైవ్ స్టార్, సెనెన్ స్టార్ రిసార్ట్స్ నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నాం. లాక్ డౌన్ సమయంలో నెలకు రూ. 10 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయాం అని మంత్రి అవంతి తెలిపారు.