జగన్ తో బాలినేని... ఫ్యామిలీతో కలిసి ఆత్మీయ భేటీ

Update: 2019-06-10 13:52 GMT
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సమీప బంధువే. జగన్ కు మామ వరుస అయ్యే బాలినేని... వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కీలక మంత్రిగా వ్యవహరించారు. వైఎస్ అకాల మరణం, ఆ తర్వాత వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం, జగన్ కు బాసటగా నిలిచేందుకు బాలినేని శ్రీనివాసరెడ్డి తన మంత్రి పదవికి రాజీనాామా చేసి మరీ వైసీపీలో చేరడం చాలా వేగంగానే జరిగిపోయాయి. జగన్ అధికారంలోకి వస్తే... బాలినేనికి అత్యధిక ప్రాధాన్యం దక్కుతుందని, జగన్ కేబినెట్ లో బాలినేని నెంబర్ టూగా మారిపోతారని కూడా చాలా విశ్లేషణలే సాగాయి. అయితే అనూహ్యంగా 2014 ఎన్నికల్లో  ఓమటిపాలైన బాలినేని... ఈ దఫా మాత్రం ఒంగోలు నియోజకవర్గం నుంచి గెలిచారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒంగోలు వెళ్లిన జగన్... బాలినేనిని గెలిపించండి, ఆయనకు మంత్రి పదవి ఇస్తానంటూ సంచలన ప్రకటన చేశారు.

జగన్ ప్రకటనకు అనుగుణంగానే ఒంగోలు ఓటర్లు బాలినేనిని గెలిపిస్తే... జగన్ కూడా తాను ఇచ్చిన మాట ప్రకారం బాలినేనికి మంత్రి పదవి ఇచ్చారు. అంతేకాకుండా ఇంధనం - అడవులు - పర్యావరణం - శాస్త్ర సాంకేతిక శాఖలను బాలినేనికి కేటాయించారు. ఈ క్రమంలో నేటి ఉదయం తొలి కేబినెట్ బేటీ జరగగా... జగన్ నివాసంలో జగన్ తో బాలినేని ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన బాలినేని జగన్ తో భేటీ అయ్యారు. ఎంతైనా మామా అల్లుళ్ల కలయిక కదా. అందులోనూ జగన్ కేబినెట్ లో ఏ ఒక్కరికి ఊహించినట్లుగా మంత్రి పదవులు దక్కకపోతే.. బాలినేనికి మాత్రం అందరూ ఊహించినట్టుగానే కీలక శాఖలు దక్కాయి.



Full View
Tags:    

Similar News