జగన్ ఇల్లు అంటే ముఖ్యమంత్రి నివాసం. దాన్ని ముట్టడించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఇప్పటికే ఒక కీలకమైన డెసిషన్ అయితే తీసేసుకున్నారు. మరి వారు ఆ దిశగానే వడివడిగా అడుగులు వేస్తున్నారు. మిలీనియం మార్చ్ పేరిట విజయవాడకు సెప్టెంబర్ 1న మొత్తం లక్షలాది ఉద్యోగులు అంతా తరలిరావాలని చూస్తున్నారు. ఒక విధంగా వైసీపీ సర్కార్ తో తాడో పేడో తేల్చుకునే ఉద్యమంగా ఉద్యోగులు భావిస్తున్నారు.
ఈ మొత్తం ఆందోళనలో సీఎం జగన్ ఇల్లు ముట్టడి అతి పెద్ద ప్రోగ్రాం. మరి దాని విషయంలో కచ్చితంగా ఉద్యోగులు ఉన్నారు. ఈ విషయం మీద మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ సీఎం ఇల్లు ముట్టడిస్తామని అంటే చూస్తూ ఊరుకుంటామా అని బిగ్ సౌండ్ చేశారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని, వారి సమస్యలు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన అన్నారు.
కానీ ఉద్యోగులు మాత్రం ఆందోళన అంటున్నారని, ఇక మిలీనియం మార్చ్ విషయం తనకు తెలియదు అని ఆయన పేర్కొన్నారు. అయినా సరే సీఎం ఇల్లు ముట్టడి అంటే సర్కార్ ఏ మాత్రం చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించే ధోరణిలో మాట్లాడారు. ఈ సందర్భంగా బొత్స కొన్ని నిజాలను ఒప్పుకున్నారు. అవును సీపీఎస్ రద్దు చేస్తామని మేము చెప్పామని ఆయన అన్నారు.
కానీ ఇపుడు దానికి బదులుగా మరో దాన్ని ప్రవేశపెడుతున్నామని, జీపీఎస్ మీద చర్చలకు ఉద్యోగులను పిలుస్తున్నామని ఆయన అన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులు వ్యవహరించాలని ఆయన కోరారు. ఉద్యోగులు అంటే ప్రభుత్వంలో భాగం కాదా అని ఆయన ప్రశ్నించారు. అయితే ఉద్యోగులు ఆందోళన బాట పడితే తాము కూడా తాము కూడా ప్రభుత్వ పరంగా ఎలా వ్యవహరించాలో అలాగే చేస్తామని అన్నారు.
తాము ఉద్యోగులను అర్ధం చేసుకోమనే కోరుతున్నామని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే ఉద్యోగులను ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదని చెప్పారు. గత ఆందోళనలో పాల్గొన్న వారికి మాత్రమే నోటీసులు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు అని ఆయన వివరించారు. ఇక ఉద్యోగులకు ఆందోళన చేసే హక్కు ఉందని, అయినా వారి సమస్యలు వినే ప్రభుత్వం ఉండగా ఆందోళన బాట ఎందుకు అన్నదే తమ వాదన అన్నారు.
మొత్తానికి బొత్స మాటలు ఒక వైపు ఉద్యోగులకు సమర్ధనగా ఉంటూనే సీఎం ఇల్లు ముట్టడిస్తే ఊరుకుంటామా అన్న రెచ్చగొట్టే ధోరణిలో ఉన్నట్లుగా కనిపిస్తోంది అంటున్నారు. ఇక ఉద్యోగుల ఆందోళన విషయం ఎలా ఉన్నా సర్కార్ మాత్రం టెన్షన్ లోనే ఉంది అంటున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన చర్యలను చేపడుతోంది. మొత్తానికి సర్కార్ అటు గట్టిగా ఉంది, ఇటు ఉద్యోగులు ఆందోళన అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.