తెలంగాణ బ‌డ్జెట్ లో ఈట‌ల లెక్కేంది

Update: 2016-03-14 08:34 GMT
తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత మూడోసారి బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టే అవ‌కాశాన్ని ద‌క్కించుకున్నారు తెలంగాణ ఆర్థిక‌మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌. తాజాగా ఆయ‌న 2016-17 వార్షిక బ‌డ్జెట్ ను ప్ర‌తిపాదించారు. ముందుగా ప్ర‌క‌టించిన దానికంటే నిమిషాల వ్య‌త్యాసంతో త‌న బ‌డ్జెట్ ప్ర‌సంగాన్ని షురూ చేశారు. గ‌త వారంలో ఏపీ బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టిన సంద‌ర్భంగా ఏపీ ఆర్థిక‌మంత్రి య‌న‌మ‌ల త‌న బ‌డ్జెట్‌ప్ర‌సంగాన్ని సుదీర్ఘంగా వినిపిస్తే.. ఈటెల మాత్రం సూటిగా విష‌యాన్ని సింఫుల్ గా చెప్పేశారు.

త‌మ ప్రాధాన్య‌త‌లు ఏమిటి? ప‌్ర‌భుత్వ ల‌క్ష్యం ఏమిటి? అన్న విష‌యాల‌తో పాటు.. లెక్క‌ల్లో త‌లెత్తే చిక్కుల గురించి వివ‌రంగా బ‌డ్జెట్ లోనే చెప్పేయ‌టం గ‌మ‌నార్హం. తెలంగాణ స‌ర్కారు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న మిష‌న్ భ‌గీర‌ధ‌కు అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇచ్చిన ఈట‌ల త‌న బ‌డ్జెట్ కేటాయింపులో రూ.25వేల కోట్ల‌ను కేటాయిస్తున్నట్లు ప్ర‌క‌టించారు. దీని త‌ర్వాత భారీ మొత్తం గ్రామీణాభివృద్ధికే ద‌క్కింది.

ప్ర‌ణాళికా వ్య‌యం కంటే ప్రణాళికేత‌ర వ్య‌యం త‌క్కువ‌గా ఉండ‌టం ఒక విశేష‌మైతే.. ఎప్ప‌టిమాదిరే రెవెన్యూ మిగులు ఈ ఏడాది రూ.3,718కోట్లుగా ఆర్థిక మంత్రి ప్ర‌క‌టించారు. ద్ర‌వ్య‌లోటును రూ.23,467 కోట్లుగా చెప్పిన ఈట‌ల.. తెలంగాణ‌రాష్ట్ర వృద్ధి రేటు పెరిగింద‌ని.. జాతీయ వృద్ధి రేటుతో పోలిస్తే అధికంగా ఉంద‌ని చెప్పారు. ఈ ఏడాది 11.67శాతం వృద్ధి రేటు ఉంద‌ని పేర్కొన్నారు. త‌న బ‌డ్జెట్ ప్ర‌సంగంలో భాగంగా ప‌లుమార్లు ఉమ్మ‌డి రాష్ట్రంపై విమ‌ర్శ‌లుచేసిన ఆయ‌న‌.. గ‌తంలో తెలంగాణ ప్రాంతానికి కేటాయింపుల కోసం ప్ర‌తి రూపాయికి బిచ్చం ఎత్తాల్సి వ‌చ్చేద‌న్న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

తెలంగాణ బడ్జెట్ లోని ముఖ్యాంశాలు చూస్తే..

=  మొత్తం బడ్జెట్ వ్యయం రూ.1,30,415 కోట్లు
=  ప్రణాళికా వ్యయం రూ. 67,630 కోట్లు
=   ప్రణాళికేతర వ్యయం రూ.62,785 కోట్లు
=   రెవిన్యూ మిగులు రూ. 3,718 కోట్లు
=   ద్రవ్యలోటు రూ. 23,467 కోట్లు
=   ఈ ఏడాది ఆదాయం రూ.72,412 కోట్లు (అంచనా)

మిష‌న్ భ‌గీర‌థ‌కు రూ.36,976 కోట్లు
సాగునీటి రంగానికి రూ. 25 వేల కోట్లు

ప్రాజెక్టుల వారీగా..
=  పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కు రూ.7,861 కోట్లు
=  కాళేశ్వరం ఎత్తిపోతలకు రూ.6,286 కోట్లు
=   సీతారామ ఎత్తిపోతలకు రూ.1,152 కోట్లు

విధానాలు

=  గోదావరి - కృష్ణానదుల్లో రాష్ట్ర వాటా 1250 టీఎంసీలు
=  మేడిగడ్డ ప్రాణహిత - పెన్‌ పహాడ్‌ - తుమ్మిడిహట్టి ప్రాజెక్టుల నిర్మాణం
=  ప్రాణహిత -  ఇంద్రావతి నీళ్లు ఒడిసిపట్టి పంట పొలాలకు నీళ్లు
=  గోదావరి - ప్రాణహిత - పెన్‌ గంగాపై నిర్మించే బ్యారేజీలకు మహారాష్ట్ర సహకారం
=  నదీజలాల సమస్యల పరిష్కారానికి ఉమ్మడి అంతర్‌ రాష్ట్ర బోర్డు

విద్య‌కు.

=  విద్యాశాఖకు ప్రణాళికా వ్యయం రూ.1694 కోట్లు
=  విద్యాశాఖకు ప్రణాళికేతర వ్యయం రూ. 9,044 కోట్లు
గ్రామీణ ప‌ట్ట‌ణాభివృద్ధికి..
= పంచాయితీ రాజ్ - గ్రామీణాభివృద్ధికి రూ.10,731 కోట్లు
= పట్టణాభివృద్ధికి రూ. 4,815 కోట్లు
రంగాల వారీగా..
=  వ్యవసాయ - సహకార - మార్కెటింగ్ శాఖకు రూ.6,759 కోట్లు
=   ఆరోగ్య రంగానికి రూ.5967 కోట్లు
=   రోడ్లు - భవనాల రంగానికి రూ.3,333 కోట్లు
=   పారిశ్రామిక రంగానికి రూ. 967 కోట్లు
=   ఐటీ - కమ్యూనికేషన్లకు రూ. 254 కోట్లు
=   సంస్కృతి - పర్యాటక రంగానికి రూ. 50 కోట్లు

సంక్షేమానికి రూ.13,412 కోట్లు

=  ఎస్సీ సంక్షేమానికి రూ.7,122 కోట్లు
=  ఎస్టీ సంక్షేమానికి రూ.3,552 కోట్లు
=   బీసీ సంక్షేమానికి రూ. 2,538 కోట్లు
=   మైనార్టీ రూ.1204కోట్లు
=  బ్రాహ్మ‌ణ సంక్షేమానికి రూ.100కోట్లు
=   మహిళ - శిశు సంక్షేమానికి రూ. 1,553 కోట్లు

వివిధ ప‌థ‌కాల‌కు

=   రుణమాఫీకి రూ.3,718 కోట్లు
=   ఆసరా పెన్షన్లకు రూ. 4,693 కోట్లు
=   కళ్యాణ లక్ష్మి పథకానికి రూ. 738 కోట్లు

వివిధ శాఖ‌ల‌కు..

=  అగ్నిమాపక శాఖకు 223 కోట్లు
=   సీసీ టీవీల మానిటరింగ్ కు రూ. 225 కోట్లు

ఈ ఏడాది ప్ర‌త్యేకం

ప్రత్యేక అభివృద్ధి నిధికి రూ. 4,675 కోట్లు
(ఏదైనా అత్య‌వ‌స‌ర‌మైన ఖ‌ర్చు వ‌చ్చి ప‌డితే ఖ‌ర్చు చేసేందుకు)

బ‌డ్జెట్ ల‌క్ష్యాలు

=   వచ్చే ఖరీఫ్ నుంచి రైతులకు 9 గంటల విద్యుత్
=   డిసెంబర్ నాటికి 6 వేల గ్రామాలు, 12 మున్సిపాలిటీలకు తాగునీరు
=   హైదరాబాద్ లో 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు
=   రాష్ట్ర వ్యాప్తంగా 40 డయాలసిస్ - డయాగ్నొస్టిక్ సెంటర్లు
=   4 వేల కిలోమీటర్ల కొత్త రహదారులు
=   మైనార్టీల కోసం 70 ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు
=   పండ్లు - కూరగాయల సాగుకు హార్టికల్చర్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌
=   మత్స్య పరిశ్రమకు ప్రోత్సాహం
=   రాబోయే మూడేళ్లలో 23,912 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యం
=   రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా ఏర్పాటుకు శ్రీకారం
Tags:    

Similar News