తరచూ ఏదో ఒక అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి.. అదే పనిగా అధికారపక్షంపై విరుచుకుపడే ఏపీ విపక్షాలు తాజాగా రాష్ట్రంలోని రోడ్ల దుస్థితి అంశాన్ని టేకప్ చేశారు. టీడీపీతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం రోడ్ల దారుణ పరిస్థితులపై అదే పనిగా విమర్శలు సంధిస్తున్నారు. ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వీలుగా పవన్ కల్యాణ్ ఒక పిలుపును ఇవ్వటం.. తమ పరిధిలో గుంతల పడిన రోడ్ల తీరు తెలిసేలా ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేయాలని కోరటం.. అందుకు తగ్గట్లే.. పెద్ద ఎత్తున స్పందన రావటం తెలిసిందే.
దీంతో ఏపీ ప్రభుత్వం మరింత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. రోడ్లను గాలికి వదిలేశారని.. అస్సలు పట్టించుకోవటం లేదంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వారికి తాజాగా ఏపీ మంత్రి పెద్దిరెడ్డి భారీ కౌంటర్ సంధించారు. రోడ్ల మీద వర్షపు నీరు నిలిచిపోవటం వల్ల.. రోడ్లు మొత్తం దారుణంగా దెబ్బ తిన్నాయంటూ చేస్తున్న వాదనల్లో నిజం లేదని.. దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. అంచనాలకు భిన్నంగా పడిన భారీ వర్షాల కారణంగా అక్కడక్కడా రోడ్లు దెబ్బ తిన్నాయని.. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి రివ్యూ సమావేశాన్ని నిర్వహించి.. తక్షణ చర్యలకు ఆదేశించారన్నారు.
అంతేకాదు.. చంద్రబాబు ప్రభుత్వంతో పోలిస్తే.. జగన్ ప్రభుత్వంలో రోడ్లకు భారీ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మంత్రి పెద్దిరెడ్డి చెప్పుకున్నారు. చంద్రబాబు హయాంలో 330 కిలోమీటర్ల మేర రోడ్లను వేశారని.. అది కూడా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద అని చెప్పిన ఆయన.. తాము ఏకంగా 3185కిలోమీటర్ల మేర టెండర్లను పిలిచినట్లుగా చెప్పారు. వర్షం ఎక్కువగా పడటం వల్ల రోడ్ల దెబ్బ తిన్నాయే కానీ.. మరే ఇతర కారణం లేదన్నారు.
అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల వ్యవధిలో 3185 కిలోమీటర్ల మేర రోడ్ల పనులకు టెండర్లు పిలిచామని.. 970 కిలోమీటర్ల పనులు పూర్తి చేసినట్లు చెప్పుకున్నారు. ఏఐబీ ద్వారా 5238 కిలోమీటర్లకు టెండర్లు పిలిచి.. 1816 కిలోమీటర్ల మేర రోడ్లు పనులు పూర్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారన్నారు. వర్షాకాలం పూర్తి అయ్యే లోపు రోడ్ల మరమ్మతులను పూర్తి చేస్తామని చెప్పిన మంత్రి.. తాజాగా రోడ్లు దెబ్బ తినటానికి కారణం.. అనుకోని రీతిలో పెద్ద ఎత్తున వర్షాల పడటంతోనే ఇలాంటి పరిస్థితిఅంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. మరి.. మంత్రివారు చెప్పినట్లే ఏపీ రోడ్ల పరిస్థితి మెరుగుపడితే అంతకు మించి కావాల్సిందేముంది?