రాజయ్యపై అసమ్మతి గళం..ఉంటాడా? ఊడుతాడా?

Update: 2018-10-01 11:02 GMT
వరంగల్ రాజకీయం హైదరాబాద్ కు చేరింది. స్టేషన్ ఘన్ పూర్ టికెట్ రాజయ్యకు ఇవ్వడంపై నియోజకవర్గంలోని టీఆర్ ఎస్ ప్రజాప్రతినిధులంతా తిరుగుబాటు చేశారు. అభ్యర్థిగా ఆయన్ను దించేయాలని సోమవారం హైదరాబాద్ వచ్చారు. వేరే ఎవరికి ఇచ్చినా అభ్యంతరం లేదంటున్నారు. దీంతో ఈ పంచాయతీ కేటీఆర్ వద్దకు చేరింది..
 
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి రాజయ్యను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆ నియోజకవర్గంలోని టీఆర్ ఎస్ జడ్పీటీసీలు - ఎంపీపీలు - ఎంపీటీసీలు - సర్పంచ్ లు సోమవారం కేటీఆర్ ను - వీలుంటే కేసీఆర్ ను కలవడానికి వచ్చారు.ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి - తాజా మాజీ ఎమ్మెల్యే రాజయ్య కూడా హాజరయ్యారు.

ఈ సమావేశంలో  రాజయ్య అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ ఖరారు చేశారని.. అధినేత నిర్ణయానికి అనుగుణంగా అందరూ మద్దతివ్వాలని కడియం శ్రీహరి కోరారని సమాచారం. కానీ రాజయ్య వైఖరి - వ్యవహారశైలి వల్ల నియోజకవర్గంలో ఓడిపోతామని.. అందుకే కడియం కానీ ఇంకెవరికైనా కానీ పోటీచేసే అవకాశం ఇవ్వాలని నియోజకవర్గ టీఆర్ ఎస్ నేతలు స్పష్టం చేశారట..  దీనిపై కేటీఆర్ ఎంత సర్దిచెప్పినా వినకపోవడంతో చేసేదేమీ లేక మరోమారు భేటికి నిర్ణయించారు. ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని కేటీఆర్ చెప్పారట.. దీంతో ఇప్పుడు స్టేషన్ ఘన్ పూర్ తాజా మాజీ ఎమ్మెల్యే రాజయ్య టికెట్ వ్యవహారం కేసీఆర్ చేతిలోకి వెళ్లిపోయింది. ఆయన ఏం నిర్ణయిస్తారు.? రాజయ్యకు టికెట్ కొనసాగిస్తాడా లేదా అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
    

Tags:    

Similar News