బ్రిటన్ ప్రధాని రాజీనామా కూడా మోడీ ఘనతేనా?

Update: 2022-10-22 02:30 GMT
బీజేపీ అన్నా.. మోడీ అన్న ఒంటికాలిపై లేస్తూ సెటైర్లు వేయడంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ముందుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చాక బీజేపీ భక్తిపరుల ప్రచారం బాగా అవుతోంది. ఆర్థిక సంక్షోభంతో బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా చేస్తే అదంతా మన మోడీ ఎఫెక్ట్ అని.. భారత్ ను తిట్టిన బ్రిటన్ విదేశాంగ మంత్రికి, భారతీయుడైన రిషి సునక్ ను ఓడించిన లిజ్ ట్రస్ కు మోడీ బుద్ది చెప్పారని.. వాళ్లు దిగిపోవడానికి మోడీనే కారణమని వాట్సాప్ యూనివర్సిటీలు, సోషల్ మీడియాలో పలు పోస్టులు చక్కర్లు కొట్టాయి.

బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా విషయాన్ని భారత రాజకీయాలకు ముడిపెడుతూ బీజేపీ అభిమానులు రెచ్చిపోవడంపై తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆర్థిక విధానాల్లో విఫలం కావడంతో యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 45 రోజుల్లోపే లిజ్ ట్రస్ రాజీనామా చేయడం నవ్వు తెప్పించిందని కేటీఆర్ ట్వీట్ చేశారు.

'భారతదేశంలో మా ప్రధాని మాకు ఏం ఇచ్చారంటే 30 ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో నిరుద్యోగ్యం ఉంది. 45 ఏళ్లలో అత్యధిక ద్రవ్యోల్బణం ఉంది. ప్రపంచంలోనే అత్యధిక ఎల్పీజీ ధరలు ఉన్నాయి. అమెరికా డాలర్ తో పోలిస్తే రూపాయి అత్యంత బలహీనంగా మారింది' అంటూ కేటీఆర్ సెటైరికల్ గా స్పందించారు. దానికి  'టోలరెంట్ ఇండియా' అనే హ్యాష్ ట్యాగ్ జతచేశారు.

ఆఆర్థిక విధానాలు సరిగా లేకపోవడం వల్ల 45 రోజులకే బ్రిటన్ ప్రధాని రాజీనామా చేయడం దేనికి.. మా దేశంలో ప్రధాని ఆర్థికంగా ఎంత విఫలమైనప్పటికీ ఇప్పటికీ పదవిలోనే కొనసాగుతున్నారని అర్థంవచ్చేలా కేటీఆర్ ట్వీట్ ఉంది.

మంత్రి చేసిన ట్వీట్ కు నెటిజన్లు స్పందిస్తూ.. 'టోలరెంట్ ఇండియా' అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేసే ప్రయత్నం చేశారు.బ్రిటన్ పరిస్థితిపై వరల్డ్ బ్యాంక్ లో చీఫ్ ఎకనమిస్ట్ గా పనిచేసిన ఆర్థికవేత్త కౌశిక్ బసు ట్వీట్ చేయగా.. మంత్రి దాన్ని రీట్వీట్ చేసి మోడీ సర్కార్ కు ముడిపెట్టి ఇలా ఎండగట్టారు.

బ్రిటన్ ప్రధాని పదవి పోవడానికి ఆమె ఆర్థిక విధానాలు కారణంగా.. అదంతా మోడీ పవర్, శక్తి సామర్థ్యాలని.. బోడిగుండికి ముడిపెట్టి అల్లిన కథనాలపై ఇలా కేటీఆర్ సెటైర్లు వేశారు. ప్రపంచంలో ఏం జరిగినా మోడీ చేసినట్టా? అని నిలదీశారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News