నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను అన్నీ తానై చూసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ కేంద్ర ప్రభుత్వం ముందు ఆసక్తికరమైన డిమాండ్ పెట్టారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ‘మన అమరావతి-ప్రజారాజధాని’ సదస్సులో ఆయన ప్రసంగించారు. అన్ని వసతులు -సౌకర్యాలతో కూడి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.5 లక్షల కోట్ల రూపాయలు కావలసి ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా విభజన పరిణామాలపై నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్లమెంటు తలుపులు బిగించి - టీవీ ప్రసారాలు లేకుండా రాష్ట్ర విభజన బిల్లు పాస్ చేశారని సంప్రదింపులు-సమన్యాయం లేకుండా రాజకీయ లబ్దికోసం రాష్ట్రాన్ని విడగొట్టారని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ అందరిదని - అక్కడ నిర్మాణాలన్నీ ఇక్కడివారు - అక్కడివారు అందరూ కట్టిన పన్నుల ద్వారా జరిగినవేనని తెలిపారు. ఉమ్మడి ఆస్తులన్నీ హైదరాబాద్ లో ఉండిపోగా అప్పులు ఏపీకి మిగిలాయని వాపోయారు. ఏపీలో ఎక్కువ జనాభానే కాదు అప్పులు సైతం అధికంగా ఉన్నాయని... హైదరాబాద్ లాంటి నగరం ఇప్పుడు నిర్మించాలంటే రూ.5 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అందుకే ఆ మేరకు కేంద్రం న్యాయం చేయాలన్నారు. ‘సహాయం చేస్తాం’ అన్నారే తప్ప విభజన బిల్లులో ఏ అంశానికి సంబంధించి స్పష్టతలేదని నారాయణ మండిపడ్డారు. రాజధాని లేని పరిస్థితులలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బస్సులో నుంచే పరిపాలన సాగించారని గుర్తుచేశారు.
రాజధాని ప్రాంత ఎంపికకోసం శివరామకృష్ణ కమిటీని వేయగా ఆ కమిటీ కొన్ని జిల్లాలలో మాత్రమే తిరిగిందని అస్తవ్యస్త నివేదిక ఇచ్చిందని నారాయణ మండిపడ్డారు. ఆ నివేదికలో ఒకచోట విజయవాడ - మరోచోట గుంటూరు - ఇంకోచోట నెల్లూరు - మరోచోట విశాఖపట్నం అయితే రాజధానికి బాగుంటుందని ఇలా అన్ని జిల్లాల పేర్లు రాశారని తద్వారా ఏపీలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నించారని నారాయణ మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు 13 జిల్లాలకు సమన్యాయం చేయాలని ఆలోచించి నదికి ఇరువైపుల రాజధాని నిర్మిస్తే బాగుంటుందని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఈ క్రమంలో ప్రతిపక్షాలు ఎన్నో అడ్డంకులు సృష్టించగా వాటన్నింటిని అధిగమించామని నారాయణ తెలిపారు. 58 రోజులలో 29 గ్రామాలలో దాదాపు 34వేల ఎకరాలు సమీకరించడం ప్రపంచ రికార్డ్ అని పేర్కొన్న నారాయణ మన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ల్యాండ్ పూలింగ్ గురించి చర్చించుకుంటున్నారని తెలిపారు. 21వ శతాబ్ధపు రాజధాని నిర్మించుకోబోతున్నామని సమస్యలను ఛాలెంజ్ గా తీసుకొని ఎదుర్కొంటూ విజయాలు సాధించడం సీఎం చంద్రబాబునాయుడుకి అలవాటన్నారు. రాజధాని అమరావతిలో అంతర్భాగంగా 9 నగరాలు ఉంటాయని ఉత్తరాదిన ఉన్న హైదరాబాద్ - చెన్నై - బెంగళూరు మాదిరిగా మరో నగరం నిర్మాణం కాబోతుందని, ఉపాధి అవకాశాలు బాగా ఉంటాయని అన్నారు. మాస్టర్ ప్లాన్ నోటిఫికేట్ ఇచ్చామని, రైతులకు ప్లాట్ల కేటాయింపు జరుగుతోందని చెప్పారు. కొన్ని రోడ్లకు టెండర్లు ఖరారయ్యాయని - మరి కొన్ని రోడ్లకు టెండర్లు పిలుస్తారని నారాయణ వివరించారు.