ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి చెందిన నాయకుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన అమరరాజా బ్యాటరీస్ ఇండస్ట్రీ విషయంలో జగన్ ప్రభుత్వం పిల్లి మొగ్గలు వేస్తోంది. ఈ కంపెనీ కారణంగా.. పర్యావరణం దెబ్బతింటోందని.. అందుకే తాము దండం పెట్టి మరీ వెళ్లిపోవాలని కోరుతున్నామని.. వ్యాఖ్యానించిన ప్రభుత్వ సలహాదారు.. సజ్జల రామకృష్ణారెడ్డి 24 గంటలు గడవక ముందే.. వెళ్లిపోమనడానికి మేమేమన్నా.. పిచ్చివాళ్లమా?! అని ఎదురు ప్రశ్నించారు. నిబంధనలు పాటిస్తూ.. కొనసాగవ చ్చని అన్నారు. ఇక, ఇది జరిగిన 24 గంటల్లో అమరరాజా బ్యాటరీస్ ఇండస్ట్రీ ఉన్న చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ వైసీపీ నాయకుడు.. మంత్రి పెద్దిరెడ్డి మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అమరరాజా గురించి పెద్దగా ఐడియా లేదని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. అమరరాజాపై మీడియాలో ఏమి రాశారో అదే తనకు తెలుసని.. చెప్పాల్సి వస్తే అదే చెప్పాలని.. దీనిపై తమకు సొంత అభిప్రాయం లేదన్నారు. ఈ ఫ్యాక్టరీ ఇష్యూతో పొలిటికల్‌గా ప్రభుత్వాన్ని డామేజ్ చేయాలనుకుంటున్నారని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు దగ్గర 4, 5 వేల ఎకరాలు తీసుకున్నారని అక్కడకు రి లోకేట్ చేయవచ్చన్నారు. వాళ్ళు పొరుగు రాష్ట్రాల ఇన్సెంటివ్స్ కోసం వెళితే ఏం చేయాలని ప్రశ్నించారు. సలహాదా రు సజ్జల రామకృష్ణారెడ్డి అమరరాజా వెళ్లిపోవాలని కోరుకుంటున్నట్టు చెప్పలేదన్నారు. ఈ వ్యవహారంపై సజ్జల కూడా వివరణ ఇచ్చారని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. కంపెనీ తమిళనాడుకు తరలివెళ్లాలని యోచిస్తున్నట్టు తమకు సమాచారం ఉందన్నారు.
ఇక, పొల్యూషన్ బోర్డు అధికారుల వైఖరిని గమనిస్తే.. కొన్నేళ్లుగా అమరరాజా కంపెనీ కారణంగా.. ఇక్కడ పొలాలు, స్థలాలు.. జనాల ఆరోగ్యం పూర్తిగా కలుషితమయ్యాయని.. అందుకే కంపెనీ ఉత్పత్తులు నిలిపివేయాలని ఆదేశించామని.. అదేసమయం లో .. కంపెనీ షట్ డౌన్‌కు కూడా ఆదేశించే అవకాశం ఉందని.. దీనిపై నిర్ణయం తీసుకుంటామని.. ప్రభుత్వంతో చర్చించి.. ఒక నోటీసు కూడా ఇస్తామని.. ప్రకటించారు. ఇక, ప్రస్తుతం కంపెనీ పరిస్థితి చూస్తే.. ఇప్పటికే పొల్యూషన్ బోర్డు ఆదేశాలతో గడిచిన మూడు నాలుగు నెలలుగా ఉత్పత్తిని నిలిపివేశారు. దీనిపై కోర్టుకు కూడా వెళ్లారు. అయితే.. పొల్యూషన్ నిబంధనల విషయంలో ఖచ్చితంగా ఉండాలని కోర్టు ఇరు పక్షాలకు ఆదేశాలు జారీ చేసింది.
ఇక, ఈ పరిణామాలను గమనిస్తే.. ప్రతిపక్ష నేతకు చెందిన బ్యాటరీస్ కంపెనీపై ప్రభుత్వం పిల్లిమొగ్గలు వేస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేతల దూకుడుకు ఎక్కడికక్కడ చెక్ పెడుతున్న విష యం తెలిసిందే. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో విచ్చల విడిగా.. వ్యవహరించిన నేతలు చాలా మంది ఉన్నారు. అప్పట్లో వీరిపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ దూకుళ్లకు అడ్డుకట్ట వేస్తోంది. అదేసమయంలో రాజకీయంగా వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అంటే.. అటు నిబంధనలు పాటించని.. కంపెనీ లపై చర్యలు తీసుకుంటూనే.. మరోవైపు.. రాజకీయంగా ప్రతిపక్షానికి చుక్కలు చూపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఈ నేపథ్యంలో అమరరాజా విషయంలో వైసీపీ అడుగులు ఆసక్తిగా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. అయితే.. ఇది ఎటు మలుపు తిరుగుతుందో చూడాలని.. భావిస్తున్నారు.