వైద్యులకు మంత్రి వార్నింగ్.. డాక్టర్ల గుస్సా

Update: 2021-03-16 05:30 GMT
ఆంధ్రప్రదేశ్ లో మంత్రి వర్సెస్ వైద్యుల పంచాయతీ చినిగి చాట అంత అయ్యింది. రోడ్లు - భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ తీరుపై అనంతపురం జిల్లా పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు సుకన్య కంటతడి పెట్టడం చర్చనీయాంశమైంది. అసలు వీరి పంచాయితీ ఏంటన్నది ఆసక్తిగా మారింది.

అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం బ్రాహ్మణపల్లిలో నీళ్ల సమస్యతో స్థానికులు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో వైసీపికి చెందిన వెంకటేశ్ - తరుణ్ అనే నాయకులు గాయపడ్డారు. వీరు రాత్రి పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. వీరిని పరామర్శించేందుకు మంత్రి శంకర్ నారాయణ ఆస్పత్రికి వెళ్లారు. ఈ క్రమంలోనే వైద్యుల విధులు, ఆస్పత్రి సౌకర్యాలపై ఆరా తీశారు. వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరెంట్ లేదు.. ఫ్యాన్లు పనిచేయట్లేదు.? ఆస్పత్రిలో రోగులను ఎలా చూస్తారు? అంటూ సస్పెండ్ చేస్తానని వైద్యులను మంత్రి శంకర్ నారాయణ హెచ్చరించారు. డ్యూటీలో ఉన్న వైద్యురాలు సుకన్యపై మండిపడ్డారు. దీంతో అక్కడే ఉన్న డా. సుకన్య భోరున విలపించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ బాబు బుడెనపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన నిరసన తెలిపారు.

విధులు సక్రమంగా నిర్వహిస్తున్నామని.. కావాలంటే బదిలీలు, సస్పెన్షన్లకు సిద్ధమని సూపరిటెండెంట్ బాబు స్పష్టం చేశారు. ఆరుగురికి ఇద్దరమే వైద్యులు ఉన్నామని.. 24 గంటలు కష్టపడి పనిచేస్తున్నా ఈ దబాయింపులు ఏంటని బాధపడ్డారు. మంత్రిపైనే వీరు ఎదురు దిరగడంతో ఆయన డీఎంహెచ్.వోకు ఫిర్యాదు చేశారు. 
Tags:    

Similar News