గత కొద్దికాలంగా తాడేపల్లిగూడెంలోని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధికారిక నివాసం వచ్చే పోయే ఎమ్మెల్యేలు మంత్రులతో కళకళలాడుతోంది. జగన్ దర్శనం కోసం నాయకులు పోటీ పడుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తాము నియోజకవర్గాల్లో చేసిన అభివృద్ధి పనులను ఏకరువు పెట్టి జగన్‌ను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని టాక్. మరి ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నారంటే.. అందుకు ఒకటే కారణం.. అదే మంత్రివర్గ విస్తరణ. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని 2019లో అధికారం చేపట్టినపుడే జగన్ స్పష్టం చేశారు. ఇప్పుడా సమయం దగ్గర పడుతుండడంతో సీఎం ఎవరికి ఉద్వాసన పలుకుతారో కొత్తగా ఎవరిని తీసుకుంటారో అనే చర్చ జోరుగా సాగుతోంది.
మంత్రివర్గ విస్తరణ దిశగా జగన్ కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే ఓ సారి మంత్రుల పనితీరుపై నివేదికలు తెప్పించుకున్న ఆయన తాజాగా మరోసారి కొత్తగా రిపోర్టులు తెచ్చుకొని వాటిని పరిశీలిస్తున్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల ప్రకారం ఈ సారి చాలామంది మంత్రులు తమ పదవులు కోల్పోతున్నట్లు తెలుస్తోంది. వారిలో ఉప ముఖ్యమంత్రులు పుష్ప శ్రీవాణి నారాయణస్వామి ఉన్నట్లు సమాచారం. వీళ్లతో పాటు కన్నబాబు వెల్లంపల్లి శ్రీనివాస్ తానేటి వనిత శ్రీరంగనాథరాజు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మొన్నటి వరకూ వేటు పడే మంత్రుల జాబితాలో లేని అవంతి శ్రీనివాస్ పేరు కూగా తాజాగా చేరినట్లు తెలుస్తోంది.
ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టినపుడు చేసిన మంత్రివర్గ విస్తరణ సమయంలో జగన్ పెద్దగా ఇబ్బంది పడలేదు. చాలా మంది సీనియర్లను మంత్రి పదవి కచ్చితంగా దక్కుతుందని ఆశ పడ్డవాళ్లను జగన్ పక్కనపెట్టినా సమస్య లేకపోయిది. ఎందుకంటే రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని చెప్పడంతో అప్పుడు పదవి దక్కని నాయకులు భవిష్యత్‌పై ఆశలు పెట్టుకున్నారు. కొందరు పరిస్థితి అర్థం చేసుకుని సైలెంట్‌గా ఉన్నారు. మరికొద్దరు సన్నిహితుల దగ్గర అసంతృప్తి వ్యక్తం చేసినా బయటకు మాత్రం ఏం చెప్పలేదు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండేలా కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
రెండేళ్లకు పైగా మంత్రులుగా కొనసాగిన నాయకులు ఇప్పుడు ఒక్కసారిగా ఆ పదవుల నుంచి దిగిపోవాలంటే కష్టమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మంత్రి పదవి పోతే తమ జిల్లాల్లో పరువు పోతుందేమోన్న భయం కొద్దిమంది నేతల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మంత్రి వర్గం నుంచి ఉద్వాసనకు గురయ్యే నేతలు ఇప్పుడు బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కే అవకాశం ఉంది. దీంతో వాళ్లను బుజ్జగించేందుకు జగన్ ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నట్లు సమాచారం. భవిష్యత్‌లో తగిన ప్రాధాన్యతనిస్తానని మంత్రి పదవి పోయిందనే కారణంతో వచ్చే ఎన్నికల్లో ఓటమి ఎదురైతే ఎమ్మెల్సీ పదవితో ఆదుకుంటానని జగన్ హామీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మరి జగన్ హామీలతో వేటు పడ్డ మంత్రులు చల్లబడతారా? లేదా తిరుగుబాటు చేస్తారా? అన్నది తేలాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.