ఏపీ రాజధాని ప్రాంతంలో బలవంతపు భూసేకరణ వ్యతిరేకిస్తున్నజనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఆదివారం సీఆర్‌డీఏ ప్రాంతమైన పెనుమాకలో పర్యటించారు. రైతులు చెపుతున్న సమస్యలను పవన్ వింటుంటగా జనంలోనుంచి ఎవరో అగంతకుడు పవన్ పైకి రాయి విసిరాడు. అయితే ఆ రాయి వేదిక మీద ఉన్న పవన్ కు అతి సమీపంలో పడింది. పవన్ దాన్ని చేతుల్లోకి తీసుకుని ఆ రాయి పట్టుకునే రైతుల సమస్యలు విన్నారు.
పవన్ మీదకు ఒక్కసారిగా రాయి పడిందన్న వార్త పొక్కడంతో ఆ ప్రాంతమంతా అలజడిరేగింది. పోలీసులు రాయి విసిరిని అగంతకుడి కోసం వెతుకులాట ప్రారంభించారు. పలువురు రైతులు మాట్లాడుతూ తాము గత ఎన్నికల ప్రచారంలో మీరు ఓట్లేయమన్నందునే టీడీపీకి ఓట్లేసి గెలిపించామని....ఇప్పుడు అదే చంద్రబాబు ప్రభుత్వం తమను బలవంతంగా బెదిరించి భూములు లాక్కుంటోందని..తమకు పెద్ద దిక్కుగా మీరే ఉండి పోరాటం చేయాలని వారందరు పవన్ ను కోరారు.