జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తాజాగా ఒక సంచలన తీర్పును వెల్లడించింది. ఢిల్లీ నగరంలోని ఐటీసీ మౌర్యా హోటల్ సెలూన్ లో ఓ మహిళకు ఉన్న పొడవాటి జుట్టును కత్తిరించినందుకు చికిత్స కోసం రూ.2కోట్ల పరిహారం చెల్లించాలని కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. మూడేళ్లపాటు ఈ కేసు కొనసాగగా గురువారం తీర్పు వచ్చింది.
హెయిర్ ప్రోడక్ట్ మోడల్ ఆష్నా రాయ్. ఆమెకున్న అందమైన జుట్టుతోనే పెద్ద పెద్ద ‘హెయిర్ కేర్ బ్రాండ్’ లకు మోడలింగ్ చేస్తోంది. అయితే తాజాగా ఆమె ఢిల్లీలోని ఓ సెలూన్‌కు వెళ్లింది. హెయిర్ కటింగ్ చేయాల్సిందిగా కోరింది. అక్కడ ఆమె సూచనలు విరుద్ధంగా సెలూన్ సిబ్బంది హెయిర్ కట్ చేశారు. ‘ఫిక్స్’ స్టైల్, నాలుగు అంగుళాల మేరకు జుట్టు మాత్రమే కత్తిరించాలని పేర్కొంది. కానీ, వారు ఆమె మాట సరిగా వినలేదు. కేవలం 4 నాలుగు అంగుళాల జుట్టును మాత్రమే మిగిల్చి పొడవాటి జుట్టునంతా కత్తిరించేశారు. అది చూసి ఆమె షాక్ అయ్యింది.
వెంటనే సెలూన్ మేనేజ్ మెంట్ కు ఫిర్యాదు చేయగా, వారు ఉచితంగా హెయిర్ ట్రీట్మెంట్ చేశారు. అయితే, ఆ ట్రీట్మెంట్ కారణంగా ఆమె జుట్టు శాశ్వతంగా దెబ్బ తింటుందని ఆశ్నా ఆందోళన వ్యక్తం చేసింది. ఇక పోతే హెయిర్ బేస్‌డ్ మోడల్ అయిన ఆమెకు జుట్టు లేకపోవడంతో ఆమెకు వచ్చే ఆఫర్లు సైతం కోల్పోవాల్సి వచ్చింది. హెయిర్ ప్రోడక్ట్ మోడల్ అయిన ఆమెకు జుట్టే ఆధారం. ఆ హెయిర్ ఆధారంగానే అనేక బ్రాండ్ లకు మోడల్ గా నటిస్తూ వస్తోంది. ఇప్పుడు హెయిర్ కట్ చేయడంతో ఆఫర్లన్నీ పోయాయి.
దాంతో ఆమె తీవ్ర వేదనకు గురైంది. జీవన శైలి మొత్తం మారిపోయింది. టాప్ మోడల్ కావాలనే ఆమె కల చెదిరిపోయింది. జుట్టు కత్తిరించడంలో సెలూన్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆమె తీవ్రమైన మానసిక వేధనకు, ఒత్తిడికి గురైంది. ఆశ్నా తన పనిపై దృష్టి పెట్టలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఆమె కన్స్యూమర్స్ కోర్టును ఆశ్రయించింది. సదరు హెయిర్ సెలూన్ పై ఫిర్యాదు చేసింది. తనకు రూ. 3 కోట్ల నష్ట పరిహారం ఇప్పించాలని కోరింది. ఆష్నా రాయ్ ఫిర్యాదును పరిశీలించిన కన్స్యూమర్స్ కోర్టు, సెలూన్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే ఆష్నా జుట్టు నష్టపోయిందని నిర్ధారణకు వచ్చింది. బాధితురాలికి రూ. 2 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని సెలూన్ ను ఆదేశించింది. అలాగే 8 వారాలలోగా ఆ మొత్తం సొమ్మును బాధితురాలికి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.