వావ్! వాట్ ఏ సీఎం సింప్లిసిటీ

Update: 2021-10-24 13:30 GMT
సీఎం వస్తున్నాడంటే ట్రాఫిక్ కిలోమీటర్ల కొద్దీ ఆగాల్సిందే. సీఎం కాన్వాయ్ పోయే వరకూ ప్రజలను ఆ రోడ్డు గుండా పోనీయరు. సీఎం హెలిక్యాప్టర్ లో వెళ్లినా కొన్ని సందర్భాల్లో ఆపేసిన సందర్భాలున్నాయి. అలాంటి డాబు దర్బాలతో మెసిలే ముఖ్యమంత్రులున్న ఈ రోజుల్లో కూడా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. తాను సీఎం అన్న హోదాను మరిచి ప్రజల్లో కలిసిపోతున్నాడు. సాధారణ పౌరుడిగా మెసులుతూ వారి అభిమానాన్ని చూరగొంటున్నారు.

తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఎంకే స్టాలిన్ నాటి నుంచి ప్రజలతో మమేకమయ్యే పనులకు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టడమే కాకుండా వారి సమస్యలు తెలుసుకునేందుు ప్రయత్నిస్తున్నారు. ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టడమే కాకుండా వారి సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వాకింగ్ చేస్తూ మహిళలతో ముచ్చటించడం.. బహిరంగంగా సైక్లింగ్ చేయడం వంటివి చేస్తూ ఔరా అనిపిస్తున్నారు.

తాజాగా ఓ బస్సు ఎక్కి అక్కడ ప్రయాణికులందరినీ ఆశ్చర్యపరిచారు. రాష్ట్రంలో జరుగుతున్న టీకా పంపిణీని పరిశీలించేందుకు చెన్నైలోని కన్నాగి ప్రాంతంలో వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లిన ఆయన.. అక్కడ ఆరోగ్య సిబ్బంది, టీకా తీసుకునే వారితో మాట్లాడి వెనక్కు వచ్చిన స్టాలిన్ కన్నాగినగర్ నుంచి టీనగర్ కు వెళుతున్న ఏ19బి బస్సు ఎక్కడంతో ప్రయాణికులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఆకస్మిక తనిఖీలో ఆర్టీసీ సౌకర్యాలపై ప్రయాణికులను అడిగి తెలుసుకున్న స్టాలిన్ ముఖ్యంగా మహిళకు ఉచిత బస్సు ప్రయాణం పథకం సరిగ్గా అమలవుతుందా? లేదా అని అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు. సీఎం ఆర్టీసీ బస్సు ఎక్కడంతో జనాలు సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు.
Tags:    

Similar News