ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే చైనాలో ఈ వ్యాధిగ్రస్తులు దాదాపు 900 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ వైరస్ బారిన ఇతర దేశాలు కూడా సతమతమవుతోంది. ఇక భారతదేశంలోనూ ఈ వైరస్ వదంతులు వినిపిస్తున్నాయి. కేరళలో ఒక కేసు నిర్ధారణ అవడంతో దేశం ఉలిక్కిపడింది. దీంతో కేంద్ర ప్రభుత్వం స్పందించి సత్వర చర్యలు ఆదేశించింది. దీంతో పెద్ద సంఖ్యలో వైరస్ లక్షణాలు ఉన్న వారందరికీ ప్రత్యేక వైద్య సదుపాయం అందిస్తున్నారు. తెలంగాణలో కూడా ఆ విధంగా చర్యలు చేపడుతున్నారు.
అయితే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలని కోరుతూ హైదరాబాద్ లో కొందరు హోమం చేశారు. కరోనా వైరస్ బారిన దేశం పడొద్దని, ప్రజలందరినీ సురక్షితంగా ఉండాలని ఆకాంక్షిస్తూ హైదరాబాద్ లోని మల్కాజిగిరిలో ప్రత్యేక పూజలు చేశారు. టీఆర్ఎస్ మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో ఈ హోమం జరిగింది. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ కరోనా వైరస్ తో ఎలాంటి ప్రమాదం కలగకూడదని ఆదివారం మల్కాజిగిరి పోతాయిపల్లిలోని రామభద్ర క్షేత్రంలో మైనంపల్లి హన్మంత్ రావు కుటుంబసమేతంగా చండీ హోమం చేశారు. ఆలయ ధర్మ కర్త, శంకర చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు సంతోశ్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు పూజా కార్యక్రమాలు చేశారు.
హోమాలకు వ్యాధులు, వైరస్ లు తగ్గుముఖం పడతాయా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అలా అయితే ఆస్పత్రులు మూసేసి అర్చకులతో పూజా కార్యక్రమాలు చేయిస్తే చాలు అని వ్యంగ్యంగా విమర్శలు చేస్తున్నారు.