అది తిన్న ఎమ్మెల్యేని అసెంబ్లీలోనే చితక్కొట్టేశారు

Update: 2015-10-08 09:10 GMT
బీఫ్ వివాదం రోజురోజుకీ మరింత ముదురుతోంది. బీఫ్ మాంసం తిన్నారంటూ యూపీలోని దాద్రి అనే వ్యక్తిని ఇంట్లో నుంచి తీసుకొచ్చి మరీ చంపేయటం లాంటి ఘటనలతో దేశవ్యాప్తంగా బీఫ్ వివాదం రచ్చ రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ప్రధాని మోడీ ఇప్పటివరకూ మాట్లాడింది లికదు. ఈ వ్యవహారంపై మోడీ స్పందించలేదంటూ ఇద్దరు ప్రఖ్యాత సాహిత్య కారులు తమకిచ్చిన అవార్డుల్ని వెనక్కి ఇచ్చేయటం తలిసిందే. ఇలా బీఫ్ వివాదం రోజుకో మలుపు తిరుగుతూ దేశ వ్యాప్తంగా రాజకీయ కలకలాన్ని సృష్టిస్తోంది.

ఇదిలా ఉంటే.. జమ్మూకాశ్శీర్ లో ఈ వ్యవహారం మరింత వికృత రూపం దాల్చింది. ఆ రాష్ట్రంలో బీప్ వినియోగంపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో.. దీనికి నిరసనగా జమ్మూకాశ్శీర్ అసెంబ్లీలోని స్వతంత్ర సభ్యుడు రషీద్ బీఫ్ పార్టీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు హాజరయ్యారు. ఇదిలా ఉండగా.. ప్రభుత్వ నిషేధం ఉన్నా.. ఎమ్మెల్యే హాస్టల్ లో రషీద్ పార్టీ ఇవ్వటం.. ఇందులో బీఫ్ ను వడ్డించటం.. కాశ్శీర్ అసెంబ్లీ అట్టుడికిపోయింది.

మాటా.. మాటా పెరిగి.. బీజేపీ ఎమ్మెల్యేలు గగన్ భగత్.. రాజీవ్ శర్మలు రషీద్ మీద దాడి చేసి చితక్కొట్టేశారు. స్పీకర్ ఎదురే ఇలా కొట్టేయటంతో అందరూ ఒక్కసారి షాక్ తిన్నారు. ఈ సమయంలో విపక్ష నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేలు రషీద్ ను కాపాడారు. ఈ ఘటనను ముఖ్యమంత్రితో సహా పలువురు ఖండించారు. ఎంత తప్పు చేస్తే మాత్రం తమ చేతుల్లోకి చట్టాన్ని తీసుకొని.. అసెంబ్లీలో కొట్టేయటం ఏమిటో..?
Tags:    

Similar News