టీడీపీపై ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌రెడ్డి మండిపడ్డారు. మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే... టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి వెళ్లి తంతామని హెచ్చరించారు. చంద్రబాబు రాజకీయ ఉగ్రవాది అని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఏపీ మంత్రులు తిప్పుకొడుతున్నారు. టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని హోంశాఖ మంత్రి సుచరిత అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. కుట్ర ప్రకారం ముఖ్యమంత్రిని టీడీపీ నేతలు దూషిస్తున్నారని సుచరిత ఆక్షేపించారు.
డ్రగ్స్ విషయంలో టీడీపీ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని కొట్టిపారేశారు. టీడీపీ నేతలు విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. గంజాయి, డ్రగ్స్‌పై తమ ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని తెలిపారు. టీడీపీ నేత నక్కా ఆనందబాబు తప్పుడు ప్రకటనలపై నోటీసులిచ్చామన్నారు. తప్పుడు ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చంద్రబాబు డైరెక‌్షన్‌లోనే ఇదంతా జరుగుతుందని దుయ్యబట్టారు. చంద్రబాబు ఫిర్యాదుపై డీజీపీ స్పందించలేదనడం అవాస్తవమన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని సుచరిత హెచ్చరించారు.
టీడీపీ నేతలు దిగజారి ప్రవర్తిస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. అలజడులు సృష్టించాలన్నది చంద్రబాబు కుట్ర అని ఆరోపించారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని, సంక్షేమ పాలనను చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పార్టీలకతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అవంతి శ్రీనివాస్ తెలిపారు.
టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. గత కొన్ని నెలలుగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న పట్టాభి.. ఇవాళ మరింత దిగజారి సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. సీఎంను ఏకవచనంతో దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. తిరుపతిలో చంద్రబాబు, పట్టాభి దిష్టి బొమ్మ ను దగ్ధం చేశారు. ఆధారాలు లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు. విశాఖపట్నంలో వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.