ఎన్టీయార్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు భగవంతుడితో సమానమని అలాంటి ప్రజా నాయకుడిని చంద్రబాబు తో పాటు కుటుంబ సభ్యులు అంతా కలసి గొంతు కోశారని వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. వియ్యంకులు ఇద్దరూ కలసి వెన్నుపోటు ఎపిసోడ్ మీద సరికొత్త అబద్దాలు చెబుతున్నారని ద్వజమెత్తారు. అన్ స్టాపబుల్ రియాలిటీ షో సీజన్ టో లో ఫస్ట్ ఎపిసోడ్ కి గెస్ట్ వచ్చిన చంద్రబాబు ఎన్టీయార్ ఆరాధ్య దైవం అని చెప్పుకున్నారు. ఆయన కాళ్ళు పట్టుకున్నాను పార్టీ కోసం అని చెప్పుకున్నారు.
ప్రోమోలో వచ్చిన ఈ చిన్న డైలాగులకే ఏపీ రాజకీయంలో రచ్చ రాజుకుంది. చంద్రబాబును పచ్చి అబద్ధాల కోరుగా నల్లపురెడ్డి అభివర్ణించారు. ఆనాడు ముఖ్యామంత్రిగా ఉన్న ఎంటీయార్ కాళ్ళను చంద్రబాబు పట్టుకోలేదు, కాళ్ళు గుంజేసి పదవి నుంచి దించేశారు. ఆయన గొంతు కోశారని మండిపడ్డారు. ఈ విషయంలో బాలయ్య సహా మొత్తం కుటుంబ సభ్యులు అంతా భాగస్వాములే అని విమర్శించారు. ఎన్టీయార్ ది పసిపిల్లవాని మనస్తత్వం అని నల్లపురెడ్డి అన్నారు.
అలాంటి మనిషి ప్రజల కోసం పాటు పడిన నేత మీద చంద్రబాబు విషపు రాజకీయాన్ని ప్రయోగించి పదవి లాక్కున్నారని అన్నారు. ఆనాడు ఘటనలో తాము ఉన్నామని ఎవరికి అబద్ధాలు చెబుతారని ఎదురు దాడి చేశారు. ఎన్టీయార్ వెంట చివరి వరకూ పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో తాను ఒకడిని అని ఆయన చెప్పారు. తామంతా చంద్రబాబుకు అమ్ముడుపోకుండా కడవరకూ ఎన్టీయార్ వెంట నిలబడ్డ అసలైన ఎన్టీయార్ భక్తులమని ఆయన చెప్పుకొచ్చారు.
చంద్రబాబు వంటి నీచ మనస్తత్వం ఎవరికీ ఉండదని పిల్లను ఇచ్చిన మామను గొంతు కోయడం ఆయనకే చెల్లిందని అన్నారు. ఆనాడు కూతుళ్ళు, అల్లుళ్ళూ కొడుకులు అంతా కలలి ఈ కుట్రలో భాగమయ్యారని, ఇపుడు వారే ఎన్టీయార్ భజన చేస్తున్నారు అని నల్లపురెడ్డి విమర్శించారు. ఆనాడు వేస్రాయ్ హొటల్ వద్ద ఎన్టీయార్ మీద చెప్పులేసింది. చంద్రబాబు కాదా అని ఆయన ప్రశించారు.
ఎన్టీయార్ కి వెన్నుపోటు పొడిచి ఆయన్ని ఈ లోకంలో లేకుండా చేసిన పాపాలు శాపాలు చంద్రబాబుకు కచ్చితంగా తగులుతాయని నల్లపురెడ్డి జోస్యం చెప్పారు. ఇప్పటికే చంద్రబాబు మనసికంగా పడుతున్న వేదన అందులో భాగమే అని ఆయన అన్నారు. కేవలం రెండు ఎకరాల ఆసామిగా ఉన్న చంద్రబాబు ఈ రోజు నాలుగు లక్షల కోట్లకు అధిపతి ఎలా అయ్యారని ఆయన నిలదీశారు. ఇంత ఆస్తి ఎలా వచ్చిందో బాబు చెప్పగలరా అని ప్రశ్నించారు. ఎక్కడెక్కడో విలాసవంతమైన భవనాలను బాబు నిర్మించుకున్నారని ఆయన ఆరోపించారు.
బాలయ్య తన కూతురుని చంద్రబాబు కోడలిగా చేసినందుకు మనసులో బాధ ఉన్నా కూడా ఆయనతో కూర్చుని ఇంటర్వ్యూ చేయక తప్పదని కూడా నల్లపురెడ్డి సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి పదవిని ఎన్టీయార్ ని దించేసి మానసికంగా హత్య చేసిన చంద్రబాబు ఇపుడు ఆ వెన్నుపోటు చరిత్ర ఎవరికీ తెలియదని అనుకుంటూ పచ్చి అబద్ధాలు పట్టపగలే చెప్పడం కంటే దారుణం వేరొకటి లేదని నల్లపురెడ్డి అన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.