బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్‌పై హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏక్తాకు చెందిన బాలాజీ టెలిఫిలిం సంస్థ నిర్మాణంలో రూపొందిస్తున్న అన్ సెన్సార్డ్ సీజన్-2 వెబ్ సిరీస్ ట్రైలర్‌లో ఆర్మీ యూనిఫాంను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఏక్తాపై విమర్శలు, ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్‌ను కలిసిన రాజాసింగ్.. ట్రైలర్‌లో ఆర్మీని అవమానించేలా సన్నివేశాలు ఉన్నాయని, ఇందుకు సంబంధించి ఏక్తాకపూర్‌పై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దేశాన్ని రక్షించే సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసేలా ఈ ట్రైలర్ ఉందని మండి పడ్డారు. ఆర్మీని కించపరిచేలా సన్నివేశాలు తీసినందుకు ఏక్తాకపూర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
విశాల్ కుమార్ అనే హైదరాబాద్ యువకుడు కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్మీ యూనిఫాంను అపహాస్యం చేశారని పేర్కొన్నారు. పరిశీలించిన అనంతరం ఏక్తాకు నోటీసులు పంపిస్తామని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ట్రైలర్‌ను ఫేస్‌బుక్ పేజీ లో విడుదల చేశారు. కాగా, ఈ సిరీస్ లోని ప్యార్ ఔర్ ప్లాస్టిక్ ఎపిసోడ్‌లో ఓ వ్యక్తి ఆర్మీ దుస్తులను వేసుకొని అసభ్యకరంగా మాట్లాడే సన్నివేశాలు ఉన్నాయి.