ఆయన చేయి వాటం చూపించారు. ఆవేశం ఆపుకోలేక తన దగ్గరకు వచ్చిన ఒక వ్యక్తి మీద చేయి చేసుకున్నారు. అదంతా వీడియో సాక్షిగా రికార్డు అయింది. ఆయనే ఘనత వహించిన కమలాపురం వైసీపీ ఎమ్మెల్యే కమ్ జగన్ సొంత మేనమామ రవీంద్రనాధ్ రెడ్డి. ఆయన గడప గడపకు కార్యక్రమంలో తన దగ్గరకు వచ్చి సమస్య చెప్పుకున్న ఒక వ్యక్తి మీద దారుణంగా మాట్లాడుతూ చేయి చేసుకున్న సంగతి రికార్డు అయి హోరెత్తింది. తెగ వైరల్ అయింది కూడా.
అయితే జరిగిందేదో జరిగింది అని ఊరుకోకుండా ఆయన తగుదునమ్మా అని మీడియా ముందుకు వచ్చి మరీ తాను చేసిన పనిని సమర్ధించుకోవడమే ఇపుడు బిగ్ ట్విస్ట్. ఎవరైనా ఆవేశం పడడమే తప్పు, అనుచితంగా మాట్లాడడం మరో తప్పు, చేయి చేసుకోవడం ఇంకో తప్పు. కానీ ఇవేమీ పట్టని రవీంద్రనాధ్ రెడ్డి మాత్రం తాను ఏమి తప్పు చేశాను అని అమాయకంగా మాట్లాడుతూ మీడియాకే షాక్ ఇచ్చారు.
తాను అభిమానంతో కొట్టాను అంటూ భలే కవరింగ్ ఇచ్చుకోవడమే ఇంకో ట్విస్ట్. ఏమీ సినీ హీరో బాలయ్యకే ఆ కొట్టుడు చెల్లిందా. ఆయన కొడితే ఒప్పుగా ఉంటుందా. బాలయ్య తన అభిమానులను ఎలా కొడతారో నేనూ అంతే అలాగే కొట్టా. జస్ట్ సరదాకి అంటూ తాను కొట్టిన వ్యక్తిని కూడా మీడియా ముందు పెట్టుకుని సాక్ష్యం ఇప్పించారు. ఆ వ్యక్తి కూడా అవును నేను తరాలుగా వైఎస్సార్ ఫ్యామిలీ ఫ్యాన్ ని అని చెప్పుకున్నారు.
మొత్తానికి తాను వైసీపీ మీద తమ మీద అభిమానం ఉన్న వారినే కొట్టాను అని ఎమ్మెల్యే గారు సమర్ధించుకున్నారు. అయితే అభిమానం ఉంటే పెట్టాలి కానీ కొట్టమని ఎక్కడ ఉంది సారూ అంటే ఆయన ఎలా జవాబు చెబుతారో. ఇక ఈ పనికి బాలయ్యను కూడా ముందు పెట్టి ఆయనతో పోలిక తెచ్చిపెట్టుకోవడం ఎందుకో అని కూడా అంటున్నారు. బాలయ్య చేసినది కూడా కరెక్ట్ అని ఎవరూ అనడం లేదు కదా అని కూడా అంటున్నారు.
ఇక ఇదే ప్రెస్ మీట్ లో రవీంద్రనాధ్ రెడ్డి మరో మాట చెప్పారు. అదేంటి అంటే తనకు పలుకుబడి ఉంది. హోదా ఉంది, గౌరవం ఉంది తనను జగన్ మామ అనో ఆయన బంధువు అనో చెప్పడం ఏంటి అని మీడియాకు క్లాస్ తీసుకున్నారు. అయితే ఆయన ఐడెంటిటీ ఏదైనా జగన్ మామ అంటేనే అతి పెద్ద గుర్తింపు దాని వల్లనే కదా పదవులు ఓట్లూ జనాల నీరాజనాలు అన్న సంగతి మరిస్తే ఎలా అని కూడా సోషల్ మీడియాలో పంచులు పడుతున్నాయి.
ఇక రవీంద్రనాధ్ రెడ్డి చేత కొట్టించుకున్న ఆయన కూడా వైఎస్సార్ ఫ్యామిలీ ఫ్యాన్ అని చెప్పారు తప్ప ఈయన ఫ్యాన్ అని చెప్పలేదు కదా అని గుర్తు చేస్తున్నారు. మొత్తానికి వైఎస్సార్ ట్యాగ్ లేకపోతే మేనమామ గెలిచేవారా అన్న చర్చ కూడా ముందుకు తెస్తున్నారుట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.