జమ్మూకశ్మీర్ భారత్ లో అంతర్భాగమా? కాదా? అన్న చర్చ ఇప్పటి ముచ్చట కాదు. దీనిపై భిన్న వర్గాలు చేసే వాదన విచిత్రంగా ఉంటుంది. ఒకపక్క దేశంలో భాగంగా ఉంటూ.. తనదైన ప్రత్యేకతతో జమ్మూకాశ్మీర్ ఉన్నప్పటికి ఈ అంశాన్ని వివాదాస్పదం చేయటానికి.. రాజకీయం చేసి ఉద్రికత్తల్ని పెంచటానికి వీలుగా చాలానే ప్రయత్నాలు జరిగాయి. కానీ.. తాజాగా అందుకు భిన్నంగా జమ్మూకాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీలోనే ఈ అంశంపై ఒక ఎమ్మెల్యే ఇష్టారాజ్యంగా మాట్లాడటం సంచలనంగా మారింది.
భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన ఎమ్మెల్యే షేక్ రషీద్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మంట పుట్టిస్తున్నాయి. తాజాగా కశ్మీర్ అసెంబ్లీలో మాట్లాడిన అతడు.. జమ్మూకశ్మీర్ భారత్ లో అంతర్భాగం కాదే కాదని వ్యాఖ్యానించటమే కాదు.. ‘ఇక్కడ ప్లెబిసైట్ (ప్రజాభిప్రాయాన్ని) నిర్వహించాలి. ఈ విషయంలో నన్ను జైలుకు పంపినా.. ఉరి తీసినా నా అభిప్రాయం మారదు. జమ్మూకశ్మీర్ భారత్ లో అంతర్భాగం కాదు.. పాకిస్థాన్ భూభాగమూ కాదు. ఈ చారిత్రక వాస్తవాన్ని అందరూ అంగీకరించాలి’’ అంటూ వ్యాఖ్యానించాడు.
జమ్మూరాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓట్లేశారని భారత్ చెబుతోందని.. అలాంటప్పుడు ప్లెబిసైట్ నిర్వహించకుండా ఎందుకు పారిపోతుందంటూ ప్రశ్నించిన అతగాడు.. ‘‘రెండు కశ్మీర్ల ప్రజలు అనుకూలంగా ఓటేస్తేనే జమ్మూకశ్మీర్ కచ్ఛితంగా భారత్ అంతర్భాగమవుతుంది’’ అంటూ తెగబడ్డాడు. నిజానికి ఈ తరహా మాటల్ని అనుమతించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇలాంటి వాటిని మొగ్గలోనే తుంచేయాల్సిన బాధ్యత స్పీకర్ మీద లేదా?చట్టప్రకారం ఎన్నికై.. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన నేతలు ఇలా ఇష్టారాజ్యంగా మాట్లాడటాన్ని చట్టం చూస్తూ ఊరుకుంటుందా? మరింత గందరగోళానికి దారి తీసేలా ఇలాంటి వ్యాఖ్యలు చేసే ప్రజాప్రతినిధులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అన్న ప్రశ్నలపై పెద్ద ఎత్తున చర్చలు జరగటమే కాదు.. కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.