నిజంగానే ఆ పని చేసిన ఇద్దరు ఎమ్మెల్యేలు .. సతీసమేతంగా సత్య ప్రమాణాలు , నిజయోజకవర్గం లో హైటెంక్షన్

Update: 2020-12-23 13:29 GMT
తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి, బిక్కవోలు మండలాల్లో రాజకీయ వేడి క్షణ క్షణానికి పెరిగిపోతుంది. అవినీతి నువ్వు చేశావు అంటే నువ్వు చేశావు అంటూ ఇద్దరు నేతలు సవాల్ విసురుకొని , ఆ సవాల్ కి  ఆలయాన్నే వేదికగా చేసుకున్నారు. బిక్కవోలు గణపతి ఆలయం రాజకీయ సవాళ్లకు కేంద్రంగా మారింది. అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దంపతులతో సహా గుడికి వచ్చి ప్రమాణాలు చేశారు.

ఈరోజు మధ్యాహ్నం 2.30 నిమిషాలకు ముహూర్తం పెట్టుకున్న వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బిక్కవోలు గణపతి ఆలయంలో స్వామివారి ముందు సత్య ప్రమాణం చేశారు. ఈ ప్రమాణాల  నేపథ్యంలో లక్ష్మీ గణపతి ఆలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఆయన సతీమణి ఆదిలక్ష్మి తో కలిసి గణపతి ఆలయానికి చేరుకుని సత్య ప్రమాణం చేశారు. ఆ తరువాత అక్కడికి 10 నిమిషాల వ్యవధిలో ఆలయానికి చేరుకున్న టిడిపి నేత మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా తన సతీమణి మహాలక్ష్మి తో కలిసి ఆలయంలో స్వామివారి ముందు సత్య ప్రమాణం చేశారు. అయితే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి భార్య ప్రమాణం చేయలేదని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఆరోపిస్తున్నారు. దీనితో  ఎన్నిసార్లు ప్రమాణం చేయడానికైనా సిద్దమని నల్లమిల్లి మరో సవాల్‌ విసిరారు.

 అయితే , ప్రస్తుత ఎమ్మెల్యే , మాజీ ఎమ్మెల్యే ఇద్దరూ కూడా ఆలయానికి వెళ్లి సత్య ప్రమాణం చేయడంతో బిక్కవోలు,అనపర్తి మండలాలలో పరిస్థితులు వేడెక్కాయి. దీనితో పోలీసులు భారీగా మొహరించారు. 144 సెక్షన్ విధించి సెక్షన్ 30 పోలీస్ చట్టాన్ని అమలు చేస్తున్నారు. గుంపులుగా ఎవరు ఉండకుండా పోలీసులు తగిన చర్యలు చేపట్టారు. అంతేకాదు నేతలు సత్య ప్రమాణాలు చేసే సమయంలో మీడియాను ఆలయంలోనికి అనుమతించలేదు. అయితే , ఒకరిపై మరొకరు అవినీతి ఆరోపణలు చేసుకొని , ఆ తర్వాత ఇద్దరు వెళ్లి తామేమి అవినీతికి పాల్పడలేదు అంటూ దేవుని ముందు ప్రమాణం చేయడంతో , దీనిపై ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ హాట్ గా చర్చ జరుగుతుంది. 
Tags:    

Similar News