బీజేపీని వీడుతూ గుండు కొట్టించుకున్న ఎమ్మెల్యే

Update: 2021-10-06 11:39 GMT
ఇన్నాళ్లూ బీజేపీలో కొనసాగి అదే పార్టీ నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి త్రిపురలోని సుర్మా నియోజకవర్గం నుంచి గెలిచిన ఆశిష్ దాస్ తృణమూల్ కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

బీజేపీని వీడుతోన్న క్రమంలో ఇన్నాళ్లూ ఆ పార్టీలో ఉన్నందుకు పాప పరిహారంగా గుండు కొట్టించుకున్నారు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్రిపురలో బీజేపీ పాలన సరిగా లేదని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు.

ఇక బీజేపీ తరుఫున గెలిచినందుకు.. ఆ పార్టీలో ఉన్నందుకు గాను చేసి తప్పులకు తాను గుండు కొట్టించుకుంటున్నట్టు ఎమ్మెల్యే చెప్పారు.

కోల్ కతాలోని కాళీఘట్ ఆలయం వద్ద ఆయన ఈ గుండు కొట్టించుకున్నాడు. అదిప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. త్రిపురలో బీజేపీ అరాచకాలకు పాల్పడుతోందని ఆరోపించారు. త్వరలోనే తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు.

ఇటీవల పశ్చిమ బెంగాల్ లోని భవానీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ విజయం సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈక్రమంలోనే బీజేపీ పాలనకు విసుగు చెందిన ఆపార్టీపై వ్యతిరేకతతో గుండు కొట్టించుకున్నారు.




Tags:    

Similar News