చిన్న పిల్లలను ఎత్తుకుపోయే ముఠాలు తిరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పుకార్లు తెలుగు పల్లెల్లో భయానక వాతావరణాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రజల్లో నెలకొన్న అనుమానాలు - భయాల కారణంగా అమాయకులు బలవుతున్న నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగి...ఇవన్నీ పుకార్లని అవగాహన కల్పించాల్సి వచ్చింది. ఇలాంటి ప్రచారం చేసిన వారిని కొందరిని అరెస్ట్ కూడా చేశారు. అయితే, పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారని సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు సామాన్యులు బలవుతున్న సంఘటనలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా ఇలాంటి దారుణ సంఘటన మహారాష్ట్ర- తెలంగాణ సరిహద్దులోని బీదర్ లో జరిగింది. హైదరాబాద్ కు చెందిన ఓ కుటుంబంపై అక్కడి స్థానికులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
ఖతార్ లో పనిచేస్తున్న సల్హాన్ ఒబేసుకే.. ఇటీవల బార్కస్ లోని తన తల్లి వద్దకు వచ్చాడు. ఎర్రకుంటలో నివాసముండే మహ్మద్ ఆజమ్ (32) - సల్మాన్ - నూర్ మహ్మద్ లను కలిసేందుకు రెండ్రోజుల క్రితం వెళ్లాడు. కర్ణాటక రాష్ట్రంలోని ఔరాద్ తాలూకా హుండికేరాకు చెందిన బషీర్ అనే వ్యక్తి వీరికి స్నేహితుడు. హైదరాబాద్ లోనే ఉద్యోగం చేస్తున్న బషీర్.. తమ రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలు బాగుంటాయని, వాటిని చూసి తమ స్వగ్రామానికి వెళదామని చెప్పడంతో ఐదుగురూ కర్ణాటకకు కారులో బయలుదేరారు. శుక్రవారం సాయంత్రం మార్గం మధ్యలో బాల్ కూట్ తండా వద్ద అల్పాహారంకోసం ఆగారు. ఖతార్ నుంచి తాను తెచ్చిన చాక్లెట్లను సల్హాన్ అక్కడి బడిపిల్లలకు పంచిపెట్టాడు. విదేశీ చాక్లెట్లు కావడంతో అవి తక్కువ తీపితో ఉన్నాయి. దీంతో పిల్లలు అక్కడున్న వారికి చాక్లెట్లు ఒకరకంగా ఉన్నాయని చెప్పారు. అప్పటికే పిల్లలను ఎత్తుకెళ్లే ముఠాలు తిరుగుతున్నాయని గ్రామంలో వదంతులున్నాయి. దీంతో కొందరు స్థానికులు ఈ ఐదుగురిని అటకాయించారు. పిల్లలను ఎత్తుకెళ్లే ముఠాలంటూ గద్దించారు. ఈ విషయాన్ని ఒక వ్యక్తి వాట్సాప్ లో షేర్ చేశాడు.
విషయం అందరికీ పాకడంతో ఒక్కసారిగా వందలమంది అక్కడకు చేరుకొని దాడికి దిగారు. దీంతో ఐదుగురూ పరారయ్యారు. తండవాసులు ఇచ్చిన సమాచారంతో తదుపరి వచ్చే ముర్కీ గ్రామస్థులు వీరిని అడ్డుకున్నారు. కారులో ఉన్న ఐదుగురిపై దాదాపు 400 మంది దాడిచేశారు. కారును బోల్తాపడేసి - వారిని చితకబాదారు. ఈ ఘటనలో డ్రైవర్ సీటులో ఉన్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆజమ్ (32) అక్కడికక్కడే చనిపోయాడు. సల్మాన్ - సల్హాన్ కు తీవ్ర గాయాలయ్యాయి. బషీర్ - నూర్ మహ్మద్ స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకుని ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు.. గ్రామస్థులను సముదాయించేందుకు ప్రయత్నించారు. అయినా వారు వినకపోవడంతో లాఠీచార్జి చేసి - చెదరగొట్టారు. గాయపడినవారిని స్థానిక హాస్పిటల్ లో చేర్పించారు. తమను హైదరాబాద్ కు పంపించాలని సల్మాన్ - సల్హాన్ కోరడంతో వారిని అంబులెన్స్ లో హైదరాబాద్ కు తరలించారు. ప్రస్తుతం మలక్ పేట యశోద దవాఖానలో చికిత్స పొందుతున్నవారిద్దరినీ మలక్ పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల - సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ పరామర్శించారు. ఘటనాస్థలంలోనే చనిపోయిన ఆజం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం నగరానికి తరలించారు. మృతదేహానికి శనివారం కుటుంబ సభ్యులు ఎర్రకుంటలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతి చెందిన ఆజం గూగుల్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడని స్థానికులు తెలిపారు.
కాగా, ఐదుగురు హైదరాబాదీలపై దాడిని కర్ణాటక పోలీసులు తీవ్రంగా పరిగణించారు. వదంతులకు కారణమైన గ్రామానికి చెందిన వాట్సాప్ అడ్మిన్లు మనోజ్ కుమార్ - అమీర్ పాటిల్ ను అరెస్ట్ చేశారు. దాడికి పాల్పడిన 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరికొందరికోసం గాలిస్తున్నారు. బషీర్ - నూర్ మహ్మద్ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఘటనపై పూర్తి సమాచారాన్ని వీరినుంచి పోలీసులు సేకరిస్తున్నారు.