సాధారణంగా మనం మొబైల్ కనెక్షన్ తీసుకోవాలంటే ఆధార్ కార్డ్ తప్పనిసరి. ఆధార్ తోనే లింక్ చేసి మనకు సిమ్ కార్డ్ ఇస్తారు. ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చి మనం ఎన్నో సిమ్ కార్డులు తీసుకుంటాం. కానీ మనకు తెలియకుండా ఎవరైనా మన ఆధార్ తో సిమ్ తీసుకుంటే ఏంటి పరిస్థితి?ఎవరైనా మన పేరున మొబైల్ కనెక్షన్ తీసుకొని సంఘ విద్రోహ చర్యలకు పాల్పడితే మనకు బ్యాడ్ నేమ్ వస్తుంటుంది. తర్వాత ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.
అందుకే మన పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లు ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. దాని కోసం టెలీ కమ్యూనికేషన్ల విభాగం (DOT)ఇటీవల TAFCOP అనే వెబ్ సైట్ ను ప్రారంభించింది. ఇది టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్ మెంట్ -కన్స్యూమర్ ప్రొటెక్షన్ కు సంక్షిప్త పేరు.
తమ ఆధార్ కార్డును ఎవరైనా ఉపయోగించి సిమ్ కార్డులను అక్రమంగా ఉపయోగిస్తున్నారా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇది సహాయపడుతుంది. చందాదారులకు తమ వద్ద ఉన్న కనెక్షన్ల సంఖ్య గురించి తెలియజేయడం ద్వారా ఈ పోర్టల్ వినియోగదారులకు సౌకర్యాలను అందిస్తుంది.
ఎస్ఎంఎస్ ద్వారా ఎవరి పేరు మీదైనా తొమ్మిది కంటే ఎక్కువ కనెక్షన్లు ఉంటే అది వారికి తెలియజేస్తుంది. వినియోగదారులు పోర్టల్ ను సందర్శించి వారు ఇక పై ఉపయోగించని లేదా అవసరమైన నంబర్ లను అందులో తెలుపవచ్చు. దీని ద్వారా టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు నంబర్లను బ్లాక్ లేదా డీయాక్టివేట్ చేస్తారు. చందాదారులు తమ పేరు మీద నమోదు చేయని తొమ్మిది కంటే ఎక్కువ మల్టిపుల్ కనెక్షన్లు కలిగి ఉంటే వెబ్ సైట్ ద్వారా అవసరమైన చర్యలు తీసుకోవచ్చు. అభ్యర్థనను సమర్పించిన తర్వాత వినియోగదారులు తమ నంబర్ తో లాగిన్ అయ్యి ‘రిక్వెస్ట్ స్టేటస్’ బాక్స్ లో ‘టికెట్ ఐడి రిఫర్ నంబ’ నమోదు చేయడం ద్వారా స్టేటస్ ను చెక్ చేయవచ్చు.
ఇందుకోసం వినియోగదారులు TAFCOP వెబ్ సైట్ ను ఓపెన్ చేసిన తర్వాత వారు తమ మొబైల్ నంబర్ ను నమోదు చేసి వన్ టైమ్ పాస్ వర్డ్ తో ధ్రువీకరించి పోర్టల్ వారి ఐడీలపై నమోదు చేయబడిన మొబైల్ నంబర్ల జాబితాను చూసుకోవాలి. తాము వాడని నంబర్లు వేరే ఇతరులు వాడితే వాటిపై ఫిర్యాదు చేయవచ్చు. వాటిని బ్లాక్ చేయించవచ్చు. అనధికారికంగా దుర్వినియోగం అవుతున్న సిమ్ ల దృష్ట్యా టెలికాం విభాగం ఏప్రిల్ లో ఈ పోర్టల్ ను ప్రారంభించింది.