తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రధాని మోడీ తొలిసారి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఎక్కడో ఉన్న విదేశానికి సైతం వెళ్లే ప్రధాని.. డిల్లీకి కూతవేటు దూరంలో (విమాన ప్రయాణం లెక్కలో సుమా) ఉన్న తెలంగాణ రాష్ట్రానికి రావటానికి రెండేళ్ల కంటే ఎక్కువ సమయం ఎందుకు పట్టిందన్న విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. మరికొద్ది గంటల్లో మోడీ తెలంగాణలో అడుగు పెట్టనున్నారు. మోడీ రాక కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన చేత ఆరు పథకాల్ని స్టార్ట్ చేయించనున్నారు.
తన పర్యటనలో భాగంగా మోడీ తెలంగాణ రాష్ట్రంలో గడిపేది కేవలం కొద్ది గంటలే అయినా.. ఆ స్వల్ప సమయంలో.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో గడిపేది మరీ తక్కువ సమయం. ఆ టైంలోనే వీలైనన్ని కార్యక్రమాలు ప్రధాని చేతుల మీదుగా షురూ చేయాలని తెలంగాణ ప్రభుత్వం తపిస్తోంది. ఇందులో భాగంగా పక్కా ఏర్పాట్లు చేసింది. ఒకే వేదిక మీద నుంచి ఆరు కార్యక్రమాలు స్టార్ట్ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేసింది.
ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఆరింటిని చూస్తే..
1. మిషన్ భగీరథ; తెలంగాణ రాష్ట్రం మొత్తంగా స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్న లక్ష్యంతో స్టార్ట్ చేసిన భారీపథకమిది. రూ.42వేల కోట్ల అంచనాతో 26 ప్యాకేజీలుగా చేపట్టిన ఈ పథకాన్ని తొలిదశలో తొమ్మిది నియోజకవర్గాల్లో తాగు నీటి అందించనున్నారు. ఇందుకోసం గజ్వేల్ నియోజకవర్గంలోని243 ప్రాంతాల్లో 66వేల కుటుంబాలకు తాగునీటిని అందించే పథకాన్ని మోడీ ప్రారంభించనున్నారు. దేశానికే రోల్ మోడల్ పథకంగా మిషన్ భగీరథ మారుతుందన్న ఆకాంక్షను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తం చేస్తుంటారు.
2. సింగరేణి విద్యుత్ కేంద్రం; 1200 మెగావాట్ల విద్యుత్ కేంద్రంగా.. రూ.8250 కోట్లతో స్టార్ట్ చేసిన ఈ పథకం సింగరేణి చేపట్టింది. అదిలాబాద్ జిల్లా జైపూర్ లో ఈ పథకాన్ని స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా రెండు యూనిట్లు ఇప్పటికి ప్రారంభమై.. విద్యుత్ ఉత్పత్తిని చేపట్టింది. తొలి యూనిట్ జూన్ లో షురూ కాగా.. రెండో యూనిట్ జులైలో స్టార్ట్ అయ్యింది. ఇప్పటివరకూ తొలి యూనిట్ 140 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసింది. ఈ ప్లాంటును ప్రధాని మోడీ జాతికి అంకితం చేస్తారు.
3. రామగుండం ఎరువుల కర్మాగారం; మూతపడిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని కేంద్రం రూ.5254 కోట్లతో తిరిగి పున:ప్రారంభిస్తోంది. కేంద్రం నేతృత్వంలో ఆధునీకీకరణ పనులు చేస్తున్నారు. ఇందులో భాగంగా భారీ ఎత్తున యూరియాను ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి.. పనులు ప్రారంభినున్నారు. గ్యాస్ ఆధారితంగా నిర్మించే ఈ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తారు. దీన్ని మోడీ షురూ చేస్తారు.
4. ఎన్టీపీసీ ప్లాంట్; విభజన సమయంలో విద్యుత్ కొరతతో అల్లాడే తెలంగాణకు ఊరటనిచ్చేలా 4వేల మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా తొలిధవలో 800 మెగావాట్లకు చెందినరెండు ప్లాంట్లను నిర్మిస్తున్నారు. రూ.10,598 కోట్ల ఖర్చుతో చేపట్టే విద్యుత్ కేంద్రానికి ఎన్టీపీసీ ప్రాంగణంలోనే ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు.
5. తెలంగాణకు సంబంధించి ఎన్నో ఏళ్లుగా వినిపిస్తున్న ఒక డిమాండ్ తాజాగా సాకారం కానుంది. హైదరాబాద్ – కరీంనగర్ జిల్లాల్ని కలిపే మనోహరాబాద్ – కొత్తపల్లి రైల్వేను నిర్మించేందుకు వీలుగా తాజాగా ప్రధాని పునాది రాయి వేయనున్నారు. రూ.1160 కోట్ల ఖర్చుతో నిర్మించనున్న ఈ రైల్వే లేన్ కు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి. గజ్వేల్ వరకు ఇప్పటికే 900ఎకరాల భూమిని పూర్తి చేసి రైల్వేలకు అప్పగించారు. 150 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ రైల్వే లైన్ ను మూడేళ్లలో పూర్తి చేయాలన్నది లక్ష్యం. మేడ్చల్ నుంచి గజ్వేల్.. సిద్ధిపేట.. సిరిసిల్ల.. వేముల వాడ మీదుగా కరీంనగర్ కు సాగే ఈ రైల్వే లైన్ కు శంకుస్థాపన పనులు పూర్తి చేస్తారు.
6. కాళోజీ హెల్త్ వర్సిటీ; విభజన లెక్కల్లో భాగంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏపీకి వెళ్లగా.. తెలంగాణలో అందుకోసం కాళోజీ పేరుతో వరంగల్ కేంద్రంగా హెల్త్ వర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దానికి శంకుస్థాపనను ప్రధాని చేపడతారు.