నోరూరించే థాలీ.. అది కూడా అలాంటి ఇలాంటి భోజనం కాదు. నిజానికి ఈ భారీ భోజనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోసం ఏర్పాటు చేశారు. అయితే.. భద్రత పరమైన ఇబ్బందుల కారణంగా ఆయన రాలేని పరిస్థితి. అందుకే.. నమో రాకపోతేనేం.. ఆయన్ను అమితంగా ప్రేమించి.. ఆరాధించే వారి కోసం ఆయన పుట్టిన రోజున ఒక విచిత్రమైన పోటీని ఏర్పాటు చేశారు.
ఇందులో గెలిచిన వారు ఏకంగా రూ.8.5 లక్షల బంపర్ ఆఫర్ ను ప్రకటించారు. ఇంతకూ అంత భారీ మొత్తం ఎందుకు ఇస్తారు? అంత కష్టంగా.. క్లిష్టంగా ఉన్న పోటీలో ఏముంటుంది? ఆ సవాలేంటి? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇంతకూ పోటీ ఏమంటే.. రెస్టారెంట్ లోని వారు ప్రత్యేకంగా సిద్ధం చేసిన నరేంద్ర మోడీ థాలీని తినేయాలి. అది కూడా 40 నిమిషాల వ్యవధిలోనే. అంత భారీ థాలీని కేవలం ముప్పావు గంట కంటే ఐదు నిమిషాల పూర్తి చేయటం అంత తేలికైన విషయం కాదు. అందుకే.. అంత భారీ మొత్తాన్ని ప్రైజ్ మనీగా పెట్టారు నిర్వాహకులు. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ లో ఉన్న ఈ రెస్టారెంట్ పేరు అర్డోర్ 2.0 పేరుతో దీన్ని ఓపెన్ చేవారు.
ఇక.. థాలీ పోటీ విషయానికి వస్తే థాలీలో మొత్తం 56 రకాలు ఉంటాయి. ఎందుకంటే.. నరేంద్ర మోడీ 56 అంగుళాల ఛాతీని గుర్తు చేసేలా దీన్ని సిద్ధం చేశారు. అయితే.. ఈ థాలీలో వెజ్ కావాలా? నాన్ వెజ్ కావాలా? అన్న అప్షన్ కూడా ఉంది. నిజానికి ఈ థాలీని ప్రధాని నరేంద్ర మోడీ కోసం సిద్ధం చేశారు. ఆయనకు బహుమానం ఇవ్వాలని భావించారు. ఇందులో భాగంగా రెస్టారెంట్ కు ఆయన్ను పిలవాలని భావించినా.. భద్రతా పరమైన ఇబ్బందులు ఎదురవుతాయన్న ఆలోచనతో.. మోడీకి బదులుగా మోడీ వీరాభిమానుల కోసం భారీ ప్లాన్ చేశారు.
ఈ నెల 17 (శుక్రవారం) నుంచి ఈ నెల 26 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. ఈ సవాలును క్రాక్ చేయగలిగితే.. వారిని ఎంపిక చేస్తారు. ఒకవేళ.. ఒకరి కంటే ఎక్కువ మంది విజేతలుగా నిలిస్తే.. వారిలోనూ విజేతను లాటరీ పద్దతిలో నిర్వహించి గెలిచిన వారికి రూ.8.5 లక్షల మొత్తాన్ని అందజేస్తారు. మరి.. అంతటి సుడిగాడు ఎవరో తెలుసుకోవాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.