ఏపీకి ప్రత్యేక హోదా - విభజన హామీలు అమలుపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. బీజేపీపై గుర్రుగా ఉన్న మిత్రపక్షం టీడీపీ కేంద్ర మంత్రులు....తమ పదవులకు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఏపీ మంత్రివర్గంలో ఉన్న బీజేపీ మంత్రులు కూడా రాజీనామాలు చేశారు. రేపో మాపో ఎన్డీఏ ప్రభుత్వం నుంచి కూడా టీడీపీ వైదొలగడం వంటి పరిణామాలు జరగవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అసలే ఏపీ - తెలంగాణలో పెద్దగా పట్టులేని బీజేపీకి....తాజా పరిణామాలతో మరింత డ్యామేజీ జరిగిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో - రాబోయే ఎన్నికల్లో ప్రచారం నిర్వహించేందుకు బీజేపీ సన్నాహాలు చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
తాజాగా, బెజవాడ - పరిసర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించేందుకుగానూ ప్రత్యేక బైకులను బీజేపీ హైకమాండ్ పంపడం చర్చనీయాంశమైంది. బీజేపీ కార్యకర్తల ప్రచారం నిమిత్ం ఉత్తరప్రదేశ్ నుంచి బెజవాడ బీజేపీ హెడ్ క్వార్టర్స్ కు ఈ బైకులు చేరుకున్నాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రచారానికి ఉపయోగించిన బైకులు...తాజాగా ఏపీకి చేరుకున్నాయి. ఎన్నికల్లో ప్రచారం కోసం - గ్రౌండ్ వర్క్ కోసం ఈ బైకులను ఉపయోగిస్తారు. తెల్లటి ఈ బైకుల మీద మోదీ బొమ్మలు ముద్రించి ఉన్నాయి. ప్రస్తుతం బీజేపీపై ఏపీ ప్రజలు మండిపడుతున్న నేపథ్యంలో....ఈ బైకులను బెజవాడకు రప్పించడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత....వైసీపీతో బీజేపీ జతకట్టబోతోందనే ఊహాగానాలు కూడా వెలువడుతున్న నేపథ్యంలో.....ఈ బైకుల చేరిక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.