భారీ మార్పుల దిశగా మోడీ కేబినెట్.. కొత్తగా ఎంట్రీ ఇచ్చేదెవరంటే?

Update: 2021-06-27 04:30 GMT
వివిధ కారణాలతో కేంద్ర మంత్రివర్గంలో ఖాళీలు ఉన్నాయి. వాటిని సర్దుబాటు చేయటంతో పాటు కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్న మాట ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అయినప్పటికీ ప్రధాని మోడీ ఆ దిశగా ఇంతవరకు నిర్ణయం తీసుకున్నది లేదు. తాజాగా ఈ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే కసరత్తు పూర్తి అయ్యిందని.. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఖాయమని చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం మోడీ మంత్రివర్గంలోకి కొత్తగా 27 మంది వస్తారని అంచనా వేస్తున్నారు.

కేంద్రమంత్రులు రామ్ విలాస్ పాశ్వాన్.. సురేశ్ అగాడి మరణించటంతోపాటు.. శివసేన.. శిరోమణి అకాలీదళ్ పార్టీలు దూరం కావటం.. ఈ పార్టీలకు చెందిన నేతలు తమ మంత్రి పదవులకు రాజీనామా చేయటం తెలిసిందే. ఇదిలా ఉండగా.. పలువురు మంత్రుల పని తీరు ఏ మాత్రం బాగోలేదని.. దీంతో భారీ ఎత్తున పునరుద్ధణ చేయాల్సిన అవసరం ఉందని మోడీ భావిస్తున్నట్లు చెబుతున్నారు.

2019లో రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ.. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే సమయంలో కొలువు తీరిన కేంద్ర మంత్రి వర్గం ఇప్పటికి కంటిన్యూ అవుతోంది. కరోనా పుణ్యమా అని మార్పులు చేర్పులు చోటు చేసుకోలేదు. పలువురు కేంద్రమంత్రుల పని తీరు ఏ మాత్రం బాగోలేదని.. ఆశాజనకంగా లేని వారిని కొనసాగించటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని భావిస్తున్న ప్రధాని మోడీ పెద్ద ఎత్తున మార్పులకు శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది.
దీనికి తోడు వచ్చే ఏడాది యూపీతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లు మార్పులు ఉంటాయని చెబుతున్నారు. ముఖ్యంగా యూపీకి చెందిన ఎంపీలకు మంత్రివర్గంలో పెద్ద పీట వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేబినెట్ లోకి కొత్తగా వచ్చే అవకాశం ఉందన్న మాట బలంగా వినిపిస్తున్ననేతలు ఎవరంటే..

-  జ్యోతిరాదిత్య సిందియా (మధ్యప్రదేశ్, రాజ్యసభ)
-  సుశీల్ మోదీ (బిహార్ ఉప ముఖ్యమంత్రి)
-  భూపేంద్ర యాదవ్ (రాజస్థాన్, బీజేపీ ప్రధాన కార్యదర్శి)
-   కైలాస్ విజయ వార్గీయ (మధ్యప్రదేశ్)
-  సర్వానంద సోనోవాల్ (అసోం మాజీ ముఖ్యమంత్రి)
-  నారాయణ్ రాణే (మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి)
-  ప్రీతమ్ ముండే (మహారాష్ట్ర)
-  సయ్యద్ జాఫర్ ఇస్లాం (బీజేపీ అధికార ప్రతినిధి)
-   అనిల్ జైన్ (రాజ్యసభ)
-  స్వతంత్ర దేవ్ సింగ్ (యూపీ)
-  వరుణ్ గాంధీ
-  పంకజ్ చౌదరి
- అనుప్రియా పటేల్ (అప్నాదళ్, బీజేపీ మిత్రపక్షం)
-  అశ్విని వైష్ణవ్ (ఒడిశా)
-  జైజయంత పాండ (ఒడిశా)
-  దినేష్ త్రివేది (మాజీరైల్వే మంత్రి)
-  పీపీ చౌధరి (మాజీ కేంద్రమంత్రి)
-  రాహుల్ కవస్వాన్ (రాజస్థాన్)
-  మీనాక్షి లేఖి (ఢిల్లీ)
-  పశుపతి పరాస్ (బిహార్, చిరాగ్ పాశ్వాన్ పై తిరుగుబాటు చేసిన నేత)
-  సుశీల్ మోడీ (బిహార్ ఉప ముఖ్యమంత్రి)
-  ఆర్సీసీ సింగ్ (జేడీయూ)
-  రాజీవ్ చంద్రశేఖర్ (కర్ణాటక, రాజ్యసభ)
-  సీఆర్ పాటిల్ (గుజరాత్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు)
-  కిరీట్ బాయ్ సోలంకి (గుజరాత్)
-  సునీత దుగ్గల్ (హర్యానా)
-  జామ్యంగ్ నంగ్యాల్ (లద్ధాఖ్)
Tags:    

Similar News