భారత్ గట్టిగా పోరాడుతోంది: మోదీ

Update: 2020-06-27 10:50 GMT
రోజురోజుకు దేశంలో కరోనా కేసులు జెట్ స్పీడుగా పెరుగుతున్న వేళ ప్రధాని నరేంద్రమోడీ మాత్రం అందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా కరోనా వైరస్ కట్టడి కోసం భారత్ గట్టిగా పోరాడుతోందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

లాక్ డౌన్ తోపాటు ఇతర చర్యల మూలంగా కరోనా దేశంలో నియంత్రణలోనే ఉందని.. ఇతర ప్రపంచ దేశాల కంటే భారత్ కట్టడిలో ముందున్నామని ప్రధాని మోదీ అన్నారు. శనివారం రెవరండ్ జోసెఫ్ మార్ తోనా 90వ జయంతి సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ మాట్లాడారు.

దేశంలో కరోనా రోగుల రికవరీ రోజురోజుకు పెరుగుతోందని.. ఇటలీ కంటే మన దేశంలో కరోనా మరణాల రేటు చాలా తక్కువగా ఉందని అన్నారు. కులం, మతం, నమ్మకం ఆధారంగా ప్రభుత్వం ఎవరిపైనా వివక్ష చూపదని మోడీ స్పష్టం చేశారు.

ఇక మాకు రాజ్యాంగమే మార్గదర్శి అని.. వన్ నేషన్, వన్ రేషన్ కార్డుతో పేదలకు బియ్యం ఎక్కడున్నా అందజేస్తున్నామని మోడీ అన్నారు. జన్ ధన్ ఖాతాల్లో నగదు జమ చేశామని.. మధ్య తరగతి ప్రజల ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ కోసం చర్యలు చేపట్టామన్నారు.
Tags:    

Similar News