పెద్ద‌నోట్ల‌పై ఫీలింగ్ మోడీకే చెప్పేయ‌చ్చు

Update: 2016-11-22 13:27 GMT
టెక్నాల‌జీ మంత్రం జ‌పించే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ తాజాగా త‌న‌కు ఉక్కిరి బిక్కిరి చేస్తున్న విష‌యంలో అదే తీరును ఫాలో అయ్యారు. పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ విపక్షాలు ఏకమై కేంద్రాన్ని నిలదీస్తుంటే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం నోట్ల రద్దుపై ప్రజల నుంచే నేరుగా అభిప్రాయాలను స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. ఇందు కోసం ఆయన ఎన్ ఎమ్(నరేంద్రమోడీ) యాప్ ద్వారా సర్వే చేయనున్నట్లు ఈరోజు ట్వీట్ లో పేర్కొన్నారు.
http://nm4.in/dnldapp”
. ద్వారా ప్రజలకు నోట్ల రద్దుపై వారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు కొన్ని ప్రశ్నలు సంధించారు. ఈ సర్వే నమో యాప్ లో ఉంది. మీరు చేయాల్సిందల్లా ఆ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని మీ సమాధానాలు ఇవ్వడమే.

1. దేశంలో నల్లధనం ఉందని భావిస్తున్నారా?

2.అవినీతి - నల్లధనంపై పోరాటం చేసి వాటిని నిర్మూలించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారా?

3. నరేంద్ర మోడీ సర్కార్ రూ.500 - నూ1000 నోట్లను రద్దు చేయడంపై మీ అభిప్రాయం ఏమిటి?

4. నోట్ల రద్దు విషయంలో మీ సలహాలూ - సూచనలూ ప్రధాని నరేంద్ర మోడీతో పంచుకోవాలనుకుంటున్నారా?

5. దేశంలో నల్లధనం - అవినీతి - నకిలీ కరెన్సీ - ఉగ్రవాదం అంతానికి మోడీ సర్కార్ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఎదురౌతున్న ఇబ్బందులను సీరియస్ గా తీసుకుంటున్నారా? దీంతో పెద్ద నోట్ల రద్దుపై ప్రజా స్పందన ఎలా ఉందో ప్రధాని మోడీ నేరుగా తెలుసుకునేందుకు, ప్రజాభిప్రాయం మోడీకి చేరేందుకు వీలుంటుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News