మోడీ అధికారంలోకి రావడానికి సోషల్ మీడియా ఎంత ప్రముఖ పాత్ర వహించిందో అందరీకీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు అదే షోషల్ మీడియాలో యువత మోడీపై ఎర్రజెండా ఎగరేశారు. గత కొంతకాలంగా మోడీకి మద్దతు పలుకుతూ వస్తున్న ఫేస్‌బుక్ వినియోగదారులు దాదాపు లక్షమంది మోడీ ఫేస్‌బుక్ పేజీని అన్‌లైక్ చేశారు. ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న రైతుల ఆత్మహత్యలు, ముఖ్యంగా వివాదాస్పద భూసేకరణ బిల్లుపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ... అన్‌లైక్స్ రూపంలో తమ అసంతృప్తి తెలిపారు.
మార్చి నెలాఖరు వరకు 2.79 కోట్ల మంది మోడీ ఫేస్‌బుక్ పేజీని లైక్ చేశారు. ఫేస్ బుక్ లో మోడీ హవా ఆ స్థాయిలో కొనసాగేది. కానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన భూసేకరణ బిల్లుకు సవరణలు, రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో... ఏప్రిల్ 7నాటికి మోడీ ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసేవారి సంఖ్య 2.78 కోట్లకు పడిపోయింది. అంటే సుమారు లక్ష మందికి పైగా మోడీపై పనిగట్టుకుని వ్యతిరేఖత ప్రదర్శించారు. ఇది ఆలోచించాల్సిన పరిణామం అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే ఢిల్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై మోడీ మా(ని)యా తగ్గిందని విశ్లేషణలు వస్తున్న నేపథ్యంలో... తాజాగా జరిగిన ఈ విషయాన్ని ప్రతిపక్షాలు కూడా తమ ఫేస్ బుక్స్ పేజీల్లో ప్రచారానికి వాడేసుకుంటున్నాయి! అయితే ఈ విషయంపై బీజేపీ నేషనల్ కమ్యూనికేషన్ సెల్ వాదన మరోలా ఉంది! '' ఇది మాపై ఎలాంటి ప్రభావం చూపించబోదు. ఫేస్‌బుక్ చేపట్టే క్లీన్‌నెస్ డ్రైవ్ వల్ల ఇలా జరిగి ఉండొచ్చు '' అని సమర్ధించుకున్నారు! అన్నారు. ఏది ఏమైనా... మోడీ హవా తగ్గుతుందని, వ్యతిరేఖత పెరుగుతుందని విమర్శలు చేస్తున్న వారి విమర్శలకు ఇటువంటి విషయాలు బలాన్ని చేకూర్తుస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు!