మోడీపై అస‌హ‌నం ఉంద‌న్న బీజేపీ ఎమ్మెల్యే

Update: 2016-12-14 16:54 GMT
పెద్ద నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ - బీజేపీలు విప‌క్షాల విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇపుడు స్వ‌ప‌క్షంలోనూ కూడా అసంతృప్తి గ‌ళం వినిపిస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే - ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీ శాస‌న‌స‌భా ప‌క్ష నేత  విష్ణుకుమార్ రాజు ఇదే విష‌యాన్ని బాహాటంగా వెల్ల‌డించారు. రూ. 500 - రూ.1000 నోట్ల ర‌ద్దుతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని చెప్పారు. ప్ర‌జ‌లు స‌హనం కోల్పోతున్నార‌ని పేర్కొంటూ ప్ర‌జ‌లే కాదు తాను సైతం స‌హ‌నం కోల్పోయాన‌ని విష్ణుకుమార్ రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఇదిలాఉండ‌గా గురువారం రాత్రి 12 గంట‌ల వ‌ర‌కే పాత రూ.500 నోటు చెల్లుబాటు కానుంది. బిల్లులు క‌ట్టేందుకు, మందులు కొనేందుకు - ప్రిపేయిడ్ రిచార్జ్‌ ల‌కు డిసెంబ‌ర్ 15వ తేదీ అర్థ‌రాత్రి వ‌ర‌కు పాత 500 నోటును చెలామ‌ణి చేయ‌వ‌చ్చు. శుక్ర‌వారం తెల్ల‌వారుజాము నుంచి పాత 500 నోటును కేవ‌లం బ్యాంకుల్లో మాత్ర‌మే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. 500 నోటుకు క‌ల్పించిన వెస‌లుబాటు రేపు అర్థ‌రాత్రితో ముగుస్తుంద‌ని ఆర్థిక‌శాఖ కార్య‌ద‌ర్శి శ‌క్తికాంత్ దాస్ తెలిపారు. ఇప్ప‌టికే కొన్ని అంశాల్లో 500 నోటు వినియోగాన్ని ప్ర‌భుత్వం ఎత్తివేసింది. రైల్వే - విమాన టికెట్ల బుకింగ్‌ - పెట్రోల్ పంపులు - టోల్ ప్లాజాల ద‌గ్గ‌ర ఉన్న వెసులుబాటును ఇటీవలే వెన‌క్కి తీసుకుంది. తాజాగా నిర్ణ‌యంతో పాత నోట్లు ఉన్న‌వారు వాటిని డిపాజిట్ చేసేందుకు బ్యాంకుల వెంట క్యూ క‌ట్టాల్సి వ‌స్తుంద‌ని అంటున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News