సోషల్ మీడియాలో మాంచి స్పీడు మీదుండే ప్రధాని మోడీకి సంబంధించి కొన్ని ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి. మోడీ ఫేస్ బుక్ అకౌంట్ కు సంబంధించి బర్సన్.. మార్స్ టెల్లర్ అధ్యయనోం పలు అంశాలు బయటకు వచ్చాయి. ఫేస్ బుక్ లో అత్యంత ప్రముఖులైన ప్రపంచ నేతల్లో మోడీ ఒకరిగా నిలిచారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కాస్త దగ్గరిగానే మోడీ హవా నడవటం ఒక విశేషం.
ఒబామా క్యాంపైన్ పేజీలో 4.6 కోట్ల లైకులు ఉంటే.. భారత ప్రధాని మోడీ వ్యక్తిగత ఫేస్ బుక్ పేజీకి 3.1 కోట్ల లైకులు.. అధికారిక ప్రధాని కార్యాలయ పేజీకి 1.01కోట్ల లైకులు ఉన్నాయి. ఈ రెండింటిని కలిపితే దాదాపుగా 4.01 కోట్ల లైకులుగా చెప్పొచ్చు. లైకుల విషయంలో ఒబామా కంటే మోడీ కాస్త వెనుక పడిన.. పరస్పర అభిప్రాయాలు వ్యక్తం చేసుకునే ఇంటరాక్షన్ విషయం లో మాత్రం అమెరికా అధ్యక్షుడి కంటే మోడీనే మొనగాడని చెప్పక తప్పదు.
2015లో మోడీ ఫేస్ బుక్ కమ్యూనిటీలో 20 కోట్లకు పైగా ఇంటరాక్షన్లు నమోదు కావటం గమనార్హం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఒబామా పేజీలో నమోదైన ఇంటరాక్షన్ల కంటే మోడీ పేజీలో దాదాపు ఐదు రెట్లు ఎక్కువగా ఇవి నమోదయ్యయి.