సీఎంలతో మోదీ సుదీర్ఘ భేటీ ...రాత్రి 9:30 వరకూ!

Update: 2020-05-11 12:30 GMT
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ఈ రోజు మధ్యాహ్నం 3 : 30 నిముషాలకి ప్రారంభమైంది. ఆయా రాష్ట్రాల్లో మహమ్మారి వ్యాప్తి, లాక్ ‌డౌన్ అమలుపై చర్చించనున్నారు ప్రధాని. మే 17 లాక్‌డౌన్-3 ముగుస్తున్న నేపథ్యంలో మరిన్ని సడలింపులు ఇవ్వాలా.. లేదంటే లాక్ ‌డౌన్ ‌ను కొనసాగించాలా? అనే దానిపై సీఎంల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడటం ఇది ఐదవసారి.

అయితే.. పలు అంశాలపై విస్తృతంగా చర్చించాల్సిన పరిస్థితి ఉండటంతో ప్రస్తుతం కొనసాగుతున్న వీడియో కాన్ఫరెన్స్ సుదీర్ఘంగా సాగనున్నట్లు తెలిసింది. మధ్యాహ్నం 3.30 గంటలకు మొదలైన సమావేశం రాత్రి 9.30 గంటల వరకూ కొనసాగనున్నట్లు సమాచారం. మధ్యలో సాయంత్రం 6 గంటలకు అరగంట విరామ సమయం ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే , ఇప్పటికే నాలుగు సార్లు సీఎం లతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే.. ఇంత సుదీర్ఘముగా ఈ సమావేశం కొనసాగించాలని ప్రధాని భావించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కరోనా ఇంకా పూర్తిగా కట్టడిలోకి రాని నేపథ్యంలో ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని మోదీ సీఎంలతో సుదీర్ఘంగా చర్చించడానికే ఈ వీడియో కాన్ఫరెన్స్ సుదీర్ఘంగా కొనసాగించబోతున్నారని తెలుస్తుంది.
Tags:    

Similar News