ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత విడుదల అవుతారా లేదా అని అన్నాడీఎంకే కార్యకర్తలు, నేతలు, అమ్మ అభిమానులు ఫుల్ టెన్షన్ లో ఉంటే... కాస్త అటు ఇటుగా బీజేపీ నేతలు కూడా జయ విడుదలవ్వాలని అంతే ఆతృతగా చూశారట! కాకపోతే అమ్మ అభిమానుల్లా పూజలు చేసి ఉండకపోవచ్చు! ఏది ఏమైతేనే... జయలలితను నిర్ధోషిగా విడుదల చేస్తూ కర్ణాటక హైకోర్టు తీర్పు వెలువరించడంతొ జయలలితతో పాటు మోడీ కూడా హ్యాపీ ఫీలవుతున్నారట! ఈ తీర్పు జయకు ఎంత ఊరటో, ఒక రకంగా ప్రధాని మోడీకి కూడా ఊరటేనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు!
రాజ్యసభలో మోడీ ప్రభుత్వానికి సంబంధించి భూ సంస్కరణలబిల్లు, నల్లధనం, దేశవ్యాప్తంగా ఒకే పన్నుల విధానానికి (జీఎస్‌టీ) సంబంధించి మొదలైన ఆరు బిల్లులు పెండింగులో ఉన్నాయి. ఈ బిల్లులు ఈసారి సమావేశాల్లో ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇదే సమయంలో ఆ ఆరు బిల్లులను సంయుక్త పార్లమెంటరీ సంఘానికి నివేదించే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈలోపు జయ నిర్థోషిగా బయటపడడం ఎన్‌డీఏ సర్కారుకు కాస్త ఊరటనిస్తుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కీలకమైన ఆరు బిల్లులను ఎట్టి పరిస్థితుల్లోనూ సమావేశాల్లోనే సభ ఆమోదింపచేసుకోవాలని భావిస్తున్న మోడీ సర్కారుకు ఆన్నాడీఎంకే మద్దతు కీలకంగా ఉంటుంది! ఈ నేపథ్యంలో జయలలిత విడుదలవడంతో... ఎన్‌డీఏ ప్రభుత్వం నిరాటంకంగా నెగ్గుకురావచ్చని, అందుకు అన్నాడీఎంకే సహకారాన్ని కోరాల్సి ఉంటుందని అంటున్నారు!
మరో ఆరేడు నెలల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్నాడీఎంకేకు, ఎండీఏ అవసరం ఎంతైనా ఉంది కాబట్టి... కచ్చితంగా రాజ్యసభలో అన్నాడీఎంకే మద్దతు మోడీ ప్రభుత్వానికి ఉంటుందని అంచనావేస్తున్నారు! ఏది ఏమైనా... కేసు నుండి ఉపశమనం పొందే సరికి అమ్మ మళ్లీ రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో కీలకం కాబోతున్నారు!A