రూపాయి పాపాయిలా గోడు పెడుతోంది. దిగాలు చూపులు చూస్తోంది. బక్కచిక్కి శల్యమైపోతోంది. రోజు రోజుకీ పతనం అంచులు చూస్తోంది. పాతాళం లోతులను కనిపెడుతోంది. అసలు రూపాయికి ఏమైంది. గలగలమని సందడి చేసే భారతీయ రూపాయి ఎందుకిలా బేల చూపులు చూస్తోంది. రూపాయిని రూపం లేకుండా చేస్తున్న చర్యలు ఏమిటి.
దాని శీఘ్ర పతనాన్ని ఆపలేని నిస్సహాయత. దానికి దారి తీసిన కారణాలు ఏంటి అన్నది కనుక ఆలోచించే సమీక్షిస్తే, విశ్లేషిస్తే చాలా సంగతులు కనిపిస్తాయి. మోడీ దేశానికి 2014లో మే నెలలో అయ్యారు. ఆ ఏడాది చివరి నాటికి అంటే డిసెంబర్ 31 నాటికి రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే 63.33 ఉంది. అంటే ఇప్పటికి ఎనిమిదేళ్ల క్రితం రూపాయి బాగానే బలంగా ఉంటూ నవ్వులు చిందించేది అన్న మాట.
మరి దేశంలో ఆర్ధికపరమైన నిర్ణయాల ప్రభావం రూపాయి మీద బాగానే పడింది అని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. అదే విధంగా అంతకంతకు పెరిగిపోయిన ద్రవ్యోల్బనం ఆర్ధిక వ్వ్యవస్థను కట్టడి చేసేందుకు ఉపయోగించాల్సిన విధానాల లోపం ఇవన్నీ కలసి రూపాయి మీద దాడి చేస్తూ వచ్చాయనే అంటున్నారు.
ఈ నేపధ్యంలో రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే ఈ ఏడాది జూలై 11 నాటికి 79.41 కి చేరింది. అంటే కేవలం ఎనిమిదేళ్ల కాలంలో పాతిక శాతం రూపాయి రూపం పోయింది అన్న మాట. ఇది శీఘ్రమైన పతనంగానే చూస్తున్నారు. దీనికి కేంద్రం చెబుతున్న కారణాలు చాలానే ఉన్నాయి. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ అయితే రూపాయి దారుణంగా క్షీణించడం పట్ల పార్లమెంట్ లో మాట్లాడుతూ కేవలం అంతర్జాతీయ పరిణామాలే రూపాయి పతనాన్ని శాసించాయి అని అన్నారు.
రష్యా ఉక్రెయిన్ యుద్ధం యుద్ధం, క్రూడాయిల్ ధరలు, ప్రపంచ ఆర్ధిక పరిస్థితులే రూపాయి విలువ తగ్గడానికి కారణాలు అని ఆర్ధిక మంత్రి చెప్పుకొచ్చారు. అంతే కాదు, బ్రిటన్ పౌండ్, జపనీస్ యాన్ విలువ కూడా ఇదే సమయంలో క్షీణించాయని సీతారామన్ చెబుతున్నారు.
అయితే రూపాయి విలువ ఎపుడు క్షీణిస్తుంది అంటే ఎగుమతులు లేకపోవడం దిగుమతులు పెద్ద ఎత్తున చేసుకోవడం, ఉత్పాదక రంగాలలో అవసరమైన అభివృద్ధి లేకపోవడం వంటి కారణాలు అని ఆర్ధిక నిపుణులు చెబుతారు. ఇక్కడ మరో మాట చెప్పుకోవాలి. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటికి డాలర్ కంటే రూపాయి విలువే ఎక్కువగా ఉండేదని చెబుతారు.
మరి అలాంటి ప్లస్ నుంచి ఇపుడు దారునమైన మైనస్ కి రూపాయి దిగజారుతోంది అంటే ఇంత పెద్ద దేశంలో ఎంతోమంది నిపుణులు, వివిధ వృత్తులలో ఉన్న వారు చేసే ఉత్పత్తులకు అంతర్జాతీయంగా మార్కెటింగ్ చేసుకోకేలపోయామా లేక స్వదీశీ ఉత్పత్తులను వదిలేసి విదేశాల మీద మోజు పడ్డామా లేక దేశీయంగా ఆర్ధిక నిర్వహణలో ఫెయిల్ అయ్యామా అన్నది చూడాలి. ఇక రూపాయి క్షీణత ఎపుడూ ఉన్నా మోడీ జమానాలో ఏకంగా పాతిక శాతం అది కూడా ఎనిమిదేళ్ల వ్యవధిలో ఉండడం అంటే ఆశ్చర్యమే అంటున్నారు. ఆర్ధిక విధానాలలో మార్పులు రావాలని కూడా సూచనలు అందుతున్నాయి మరి.